Share News

BJP: బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందా.. అన్ని రాష్ట్రాల్లోనూ పతనం ప్రారంభమైందా..

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:48 PM

ప్రతి మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ ఓడిపోబోతుందని అంచనా వేశారు. హర్యానా మాత్రమే కాకుండా రానున్న ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడుతోందని, ఎక్కడా కూడా సానుకూల ఫలితాలు సాధించే అవకాశం లేదని ..

BJP: బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందా.. అన్ని రాష్ట్రాల్లోనూ పతనం ప్రారంభమైందా..
KK Survey

దేశ వ్యాప్తంగా తమకు తిరుగులేదని.. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యమంటూ పదేళ్ల క్రితం నినాదం ఇచ్చిన బీజేపీ కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉనికిని దేశవ్యాప్తంగా తగ్గించే ప్రయత్నం చేసింది. 2014, 2019 ఎన్నికల్లో హస్తం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 2024 వచ్చేసరికి కాంగ్రెస్ కొంత బలం పుంజుకుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఇండియా కూటమిగా ఏర్పడి.. బీజేపీ ప్రభావాన్ని కొంతమేర తగ్గించగలిగింది. అయినప్పటికీ ఎన్డీయే కూటమి అధికారానికి కావాల్సిన సీట్లను దక్కించుకుంది. బీజేపీ ఆశించిన విధంగా కూటమికి 400 సీట్లు రాకపోయినా.. సాధారణ మెజార్టీ వచ్చింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఎస్పీ, కాంగ్రెస్ కూటమి సమర్థంగా ఎదుర్కొగలిగింది. రెండు పార్టీలు కలవడంతో బీజేపీకి గతంతో పోలిస్తే భారీగా ఎంపీ సీట్లు తగ్గాయి. మొత్తం 80 లోక్‌సభ సీట్లు ఉన్న యూపీలో ఎన్డీయే కూటమి 36 సీట్లు గెలుచుకోగా.. ఇండియా కూటమి 43 సీట్లను గెలుచుకుంది. యూపీలో దాదాపు 60కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేసుకున్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో నిరాశ ఎదురైంది. దీంతో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్క్‌ను చేరుకోలేకపోయింది. మిత్రపక్షాల సహకారంతో వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. మూడుసార్లు వరుస విజయాలు సాధించిన బీజేపీ గ్రాఫ్ ప్రస్తుతం తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల వేళ వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేల్లో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా తగ్గుతుందని, బీజేపీ క్రమంగా తన బలాన్ని కోల్పోతుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తన ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలతో సంచలనం సృష్టించిన కేకే సర్వే సంస్థ దేశంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని ప్రకటించింది.

AP News : జగన్‌ బేజారు!


కేకే సర్వే నిజమవుతుందా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లను ఎవరి మద్దతు లేకుండా గెలుచుకుంటుందని కేకే సర్వే వ్యవస్థాపకులు కిరణ్ కొండేటి తెలిపారు. ఎగ్జిట్‌పోల్స్‌ను పోలింగ్ తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ప్రతి మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ ఓడిపోబోతుందని అంచనా వేశారు. హర్యానా మాత్రమే కాకుండా రానున్న ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడుతోందని, ఎక్కడా కూడా సానుకూల ఫలితాలు సాధించే అవకాశం లేదని కేకే అంచనా వేశారు. మరోవైపు జాతీయస్థాయి సర్వే సంస్థలు మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ కొంత ఎడ్జ్‌లో ఉందని తెలిపాయి. జాతీయస్థాయి సర్వే సంస్థల అంచనాలకు కేకే సర్వే భిన్నంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో జాతీయస్థాయి సర్వే సంస్థల అంచనాలు ఫెయిల్ కావడంతో సర్వేలపై పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. కేకే సర్వే ఏపీ ఎన్నికల్లో ఫలితాలపై సరైన అంచనాలను వెల్లడించడంతో ఆ సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ప్రస్తుతం కేకే సర్వే దేశ వ్యాప్తంగా నిజమవుతుందా అనే చర్చ జరుగుతోంది.

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు


బీజేపీ బలహీనపడుతుందా

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఆ పార్టీ ఉత్తరాదిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఎక్కువ సీట్లు కోల్పోవడంతోనే ఆ పార్టీ సొంతంగా మెజార్టీ మార్క్ చేరుకోలేకపోయింది. 2019ఎన్నికలతో పోలిస్తే 2024లో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ ఎన్డీయే కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బలహీనపడుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేకే సర్వే సైతం ఇదే అంశాన్ని చెబుతోంది. బీజేపీ నిజంగానే బలహీనపడుతుందా లేదా అనేది హర్యనా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.


Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 20 , 2024 | 03:48 PM