Share News

Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:59 PM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. అవి నేటికి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల నుంచి దుర్గా పూజల వైపు దృష్టి మరలించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ సూచించారు.

Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి

కోల్‌కతా, సెప్టెంబర్ 10: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. అవి నేటికి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల నుంచి దుర్గా పూజల వైపు దృష్టి మరలించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ సూచించారు. ముఖ్యమంత్రి మమతా బెన్జర్జీ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?


సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన మృతురాలి తల్లి..

అలాంటి వేళ సీఎం మమత వ్యాఖ్యలపై ట్రైయినీ వైద్యురాలు తల్లి మంగళవారం కోల్‌కతాలో స్పందించారు. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ఖండించారు. తమ కుమార్తె హత్యాచార ఘటనలో న్యాయం జరగాలంటూ జరుగుతున్న నిరసనలు అణిచి వేసేందుకు మమత ప్రభుత్వ ప్రయత్నిస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


భవిష్యత్తులో కుమార్తెతో కలిసి పూజలు చేసుకోలేం..

తన కుమార్తె దారుణ హత్యకు గురై తాము బాధపడుతున్న వేళ.. మమత బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు సున్నితత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. ప్రతి ఏడాది దుర్గా పూజను తమ కుమార్తెతో కలిసి జరుపుకునే వారమని ఈ సందర్బగా ఆమె గుర్తు చేసుకున్నారు. కానీ భవిష్యత్తులో తమ కుమార్తెతో దుర్గా పూజ మాత్రమే కాదు.. ఏ పండగ కలిసి నిర్వహించుకోలేమన్నారు. ఇదే తరహా ఘటన సీఎం మమతా బెనర్జీ కుటుంబంలో జరిగితే.. ఆమె ఇలాగే స్పందించే వారా? అని ఆమె ప్రశ్నించారు.

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు


ఇంటి దీపాన్ని శాశ్వతంగా ఆర్పేశారు..

తమ కుమార్తెకు న్యాయం జరగాలంటూ చాలా రోజులుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వాటిని అణిచేవేసేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటన్నారు. తన కుమార్తెను హత్య చేయడం ద్వారా తన ఇంటి దీపాన్ని శాశ్వతంగా ఆర్పేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె హత్యాచార ఘటన కేసులో న్యాయాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇంతకీ సీఎం మమతా ఏం మాట్లాడారంటే..

కోల్‌కతాలోని సెక్రటేరియట్‌లో సీఎం మమతా బెనర్జీ సోమవారం మాట్లాడుతూ.. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. ఈ కేసును సీబీఐ సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తుందని తెలిపారు. పండగలు జరుగుతున్నాయని.. వాటి వైపు మరలాలంటూ ప్రజలకు ఆమె విజ్జప్తి చేశారు. అదీకాక ఈ జూనియర్ వైద్యులు నిరసనల కారణంగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం మమత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇప్పటికే ఆరోపణలు ఖండించిన సీఎం మమత..

మరోవైపు తమ కుమార్తె హత్యాచార కేసులో తాము మౌనంగా ఉండేందుకు ఓ సీనియర్ పోలీస్ అధికారి నగదు ఇవ్వబోయారంటూ ట్రైయినీ వైద్యురాలు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీఎం మమత ఖండించారు. ఇవి పూర్తి అపవాదు ఆరోపణలుగా ఆమె అభివర్ణించారు. ఈ ఆరోపణల వెనుక మోదీ ప్రభుత్వంతోపాటు వామపక్షాల కుట్ర దాగి ఉందని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 10 , 2024 | 02:00 PM