Share News

Kolkata: సుప్రీం గడువు ముగిసినా విధుల్లోకి చేరని డాక్టర్లు, 51 మందికి నోటీసులు

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:56 PM

ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం కోరుతూ నిరసనలకు దిగిన జూనియర్ డాక్టర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వారు విధుల్లోకి చేరలేదు.

Kolkata: సుప్రీం గడువు ముగిసినా విధుల్లోకి చేరని డాక్టర్లు, 51 మందికి నోటీసులు

కోల్‌కతా: ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం కోరుతూ నిరసనలకు దిగిన జూనియర్ డాక్టర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వారు విధుల్లోకి చేరలేదు. బాధితాలికి న్యాయం జరగాలనే తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ విధులకు దూరంగా ఉంటామని వారు ప్రకటించారు.


నిరసనల్లో పాల్గొంటున్న రెసిడెంట్ డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని అత్యున్నత న్యాయస్థానం గత సోమవారంనాడు ఆదేశాలిచ్చింది. విధుల్లోకి చేరే జూనియర్ డాక్టర్లను అడ్డుకోవద్దని, కక్ష సాధింపు బదలీలు చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. ఇందుకు బెంగాల్ సర్కార్ సైతం తమ సమ్మతిని తెలియజేసింది.

Air Force: మహిళా అధికారిపై లైంగిక వేధింపులు, వింగ్ కమాడర్‌పై కేసు


కాగా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించకుండా ఆందోళనలు కొనసాగిస్తు్న్న వైద్యులు తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. ''మా డిమాండ్లు నెరవేరేంత వరకూ విధుల్లోకి వెళ్లం. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, హెల్త్ సెక్రటరీని, హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లను సాయంత్రం 5 గంటల్లోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వా్న్ని కోరాం. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.


51 మంది డాక్టర్లకు ఆర్జీ కర్ నోటీసులు

మరోవైపు, బెదిరింపు సంస్కృతిని ప్రోత్సహిస్తూ, సంస్థ ప్రజాస్వామిక వాతావరణానికి ముప్పగా పరిణమిస్తున్నారంటూ 51 మంది వైద్యులకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11న విచారణ కమిటీ ముందు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాలేజీ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ వారిపై నిషేధం విధించింది.


Read More National News and Latest Telugu News Click Here

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 10 , 2024 | 08:58 PM