Share News

Kangana Ranaut Row: కంగనా చెంప ఛెళ్లుమనిపించిన మహిళా అధికారికి ‘బంపరాఫర్’..?

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:07 PM

ఇటీవల బాలీవుడ్ నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్‌‌పై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసిన విషయం అందరికీ..

Kangana Ranaut Row: కంగనా చెంప ఛెళ్లుమనిపించిన మహిళా అధికారికి ‘బంపరాఫర్’..?
Kulwinder Kaur Who Slaps Kangana Gets Bumper Offer

ఇటీవల బాలీవుడ్ నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్‌‌పై (Kangana Ranaut) చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (Kulwinder Kaur)ను సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. దీంతో.. ఆమెకు కొందరు అండగా నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ (Vishal Dadlani) సైతం ఆమెకు మద్దతు తెలిపాడు. తాను హింసను ప్రోత్సాహించనని పేర్కొంటూనే.. ఆమె వ్యక్తిగత కోపాన్ని అర్థం చేసుకోగలనని పేర్కొన్నాడు. ఇదే సమయంలో.. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ బంపరాఫర్ కూడా ప్రకటించాడు.


విశాల్ దద్లానీ ఇన్‌స్టా స్టోరీ

‘‘నేను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను. కానీ.. నేను ఆమె కోపాన్ని అర్థం చేసుకోగలను. ఒకవేళ సీఐఎస్ఎఫ్ ఆ మహిళా అధికారిపై ఏమైనా చర్యలు తీసుకుంటే.. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా ఆమె అంగీకరిస్తేనే. జై హింద్.. జై జవాన్... జై కిసాన్” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విశాల్ రాసుకొచ్చాడు. సాధారణంగా.. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన తారలకు ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ.. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ఇతర సెలెబ్రిటీలు వాళ్లకు మద్దతుగా దిగుతారు. కానీ.. విశాల్ ఇక్కడ కంగనాకి బదులు సీఐఎస్ఎఫ్ అధికారికి మద్దతు తెలపడం గమనార్హం.


అసలేం జరిగింది?

గతంలో పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్ద చేపిన ఆందోళనలపై కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. రూ.100 తీసుకొని వాళ్లందరూ ఆ ఆందోళనల్లో పాల్గొన్నారంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగడంతో.. కంగనా తన ట్వీట్ డిలీట్ చేసింది. కానీ.. కుల్విందర్ ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఇన్నాళ్ల తర్వాత కంగనా తనకు ఎయిర్‌పోర్టులో తారసపడటంతో.. ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఆందోళనల్లో తన తల్లి కూడా పాల్గొందని, రైతులను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే తాను కంగనాను కొట్టానని ఆమె వివరణ ఇచ్చింది.


ఘటన తర్వాత పరిణామాలు

కంగనాపై కుల్విందర్ కౌర్ చెయ్యి చేసుకుందన్న విషయం వెలుగులోకి రావడం, అది వివాదం కావడంతో.. సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. కొన్ని గంటల్లోనే ఆమెని సస్పెండ్ చేసి, విచారణ నిమిత్తం శుక్రవారం అరెస్ట్ చేశారు. మరోవైపు.. తనకు ఉద్యోగం పోతుందనే భయం లేదని, తన తల్లి గౌరవం కోసం ఇలాంటి వేలాది ఉద్యోగాలు కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్నానని కుల్విందర్ తెగేసి చెప్పింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 08:07 PM