JK attcks: కశ్మీర్ దాడుల వెనుక లష్కరే మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్.. పాక్ నుంచే ఆపరేషన్
ABN , Publish Date - Jul 07 , 2024 | 02:51 PM
జమ్మూకశ్మీర్‌లో తాజా ఉగ్ర దాడుల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉందని భద్రతా సంస్థలు వెల్లడించాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం కసూర్ జిల్లా షాంగమాంగ గ్రామానికి చెందిన సైఫుల్లాపై 10 లక్షల రివార్డు కూడా ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో తాజా ఉగ్ర దాడుల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (Lashkar-e-Toiba) టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ (Saifullah sajid Jatt) హస్తం ఉందని భద్రతా సంస్థలు వెల్లడించాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం కసూర్ జిల్లా షాంగమాంగ గ్రామానికి చెందిన సైఫుల్లా కరడుకట్టిన తీవ్రవాదని, ఆయనపై 10 లక్షల రివార్డు కూడా ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
ఇస్లామాబాద్‌లోని బేస్ క్యాంప్ నుంచి సైఫుల్లా తన కార్యకలాపాలు సాగిస్తుండగా, భారత సంతతికి చెందిన ఆయన భార్య అతనితో ఉంటూ సహకరిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి గతంలో సైఫుల్లా ఉగ్ర కార్యకలాపాలు సాగించే వాడు. ప్రస్తుతం లష్కరేలో కొత్తవారిని చేర్చుకోవడం, పాక్ సరిహద్దుల నుండి భారతలోకి చొరబడే టెర్రరిస్టులకు సహాయం అందించడం చేస్తున్నాడు. లష్కరే ఆపరేషన్ కమాండర్‌గా కూడా వ్యవహరిస్తూ టెర్రర్ ఫండింగ్‌లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా కశ్మీర్ లోయలో పలు ఉగ్రదాడుల్లో అతని హస్తం ఉంది.
Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం
రెండు నెలలుగా ఉగ్రదాడులు..
కాగా, కశ్మీర్‌లో గత రెండు నెలలుగా పలు ఉగ్రదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత నెలలో యాత్రికులు పర్యటిస్తున్న ఒక బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ దాడిలో బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు ఒక గ్రామంలోకి చొరబడి కాల్పులు జరిపారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వగానే భద్రతా దళాలు అక్కడికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, ఒక ఉగ్రవాదిని బలగాలు కాల్చిచంపాయి. కాగా, గత రెండ్రోజులుగా కుల్గావ్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఒక పారాట్రూపర్ సహా ఇద్దరు సైనికులు మృతిచెందారు. ఓవైపు అమర్‌నాథ్ యాత్ర జరుగుతుండగా ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడుతున్నారు.
For Latest News and National News click here