Congress Manifesto Live Updates: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..
ABN , First Publish Date - Apr 05 , 2024 | 11:55 AM
Congress Manifesto 2024:: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ పథకాలు, 25 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు.
Live News & Update
-
2024-04-05T12:51:27+05:30
బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ఉన్నాయి: రాహుల్
కేంద్రసంస్థలతో బెదిరించి నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు.
కేంద్రసంస్థలను ప్రయోగించి పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్నారు.
ఆర్థికంగా బీజేపీ తమను తాము పరిపుష్టం చేసుకున్నారు.
బీజేపీ మేనిఫెస్టోలో 1-2% ఉన్న అదానీ వంటివారు కోరుకున్నవి ఉంటాయి.
మా మేనిఫెస్టోలో మాత్రం మిగతా 98-99% ప్రజలు కోరుకునేవి ఉన్నాయి.
ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవారికి.. కాపాడేవారికి మధ్య పోరాటం.
నాలుగు పెద్ద కార్పొరేట్ సంస్థల కోసం దేశం కాదు.
వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తాం.
కాంగ్రెస్ గ్యారంటీలంటే.. కాంక్రీట్ గ్యారంటీలే.
-
2024-04-05T12:50:13+05:30
MS స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర: ఖర్గే
నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం.
మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ మూడేళ్లలో పూర్తి చేస్తాం.
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.
వ్యవసాయ పరికరాలపై GST మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.
SC, ST, BC విద్యార్థులకు స్కాలర్‌షిప్ రెట్టింపు.
SC, ST, BCలకు రిజర్వ్ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ చేస్తాం.
సామాజిక న్యాయం కింద పింఛన్ రూ.1000కి పెంపు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ పెంపు.
ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400కు పెంపు.
-
2024-04-05T12:22:37+05:30
కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్ గాంధీ ట్వీట్..
-
2024-04-05T12:21:23+05:30
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో...
ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు కనీస మద్దతు ధర.
ఎంఎస్ పి డైరెక్ట్‌గా రైతులకు కేంద్రాలలో ఇస్తాము.
రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్.
నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం.
మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.
పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.
-
2024-04-05T12:14:37+05:30
కాంగ్రెస్ గతంలో చేసిన అభివృద్ధినే కొనసాగిస్తాం: ఖర్గే
👉 పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష అందిస్తాం.
👉 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం.
👉 కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటాం.
👉 పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తాం.
👉 రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తాం.
👉 విద్యార్థులకు రూ.లక్ష ఆర్థికసాయం చేస్తాం.
-
2024-04-05T12:12:32+05:30
పదేళ్లలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతంగానే ఉంది: చిదంబరం
👉 రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, పెట్రో ధరల తగ్గింపు చర్యలు.
👉 50 శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత.
👉 సంపన్నుల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోంది.
👉 మోదీ పాలనలో ప్రజాస్వామ్యం బలహీనపడింది.
👉 ఒక్క శాతం ఉన్న ధనికుల కోసమే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తుంది.
👉 నిరుపేదలను మోదీ సర్కార్ పట్టించుకోలేదు.
-
2024-04-05T12:11:07+05:30
గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు: చిదంబరం
దేశంలోని అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది.
ధరలు పెరిగాయి.. నిరుద్యోగిత పెరిగిపోయింది.
వృద్ధిరేటు పెరగలేదు, ఐదేళ్లుగా వేతనాలు కూడా పెరగలేదు.
యూపీఏ హయాంలో 7.8 శాతం వృద్ధిరేటు నమోదైంది.
దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం.
30 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్.
రూ.450కే వంట గ్యాస్ సిలింబర్ పంపిణీ.
-
2024-04-05T12:07:39+05:30
గదిలో కూర్చొని రూపొందించింది కాదు..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆ పార్టీ నాయకురాలు అల్కా లాంబా మాట్లాడారు. ఇది ‘న్యాయ్ పత్ర’ అని అన్నారు. తలుపులు మూసి ఉన్న గదుల్లో కూర్చొని చేయలేదని, ‘భారత్ జోడో యాత్ర’, భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రజల పరిస్థితిని చూసి రూపొందించిన మేనిఫెస్టో అని పేర్కొన్నారు.
-
2024-04-05T12:04:08+05:30
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో...
👉 దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో హాస్పిటల్ ఏర్పాటు.
👉 యూనివర్సిటీలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రోహిత్ వేముల ఆక్ట్ అమలు చేస్తాం.
👉 వెనకబడిన పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం.. బ్యాంకు అకౌంట్‌లో వెస్తాము.
👉 ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్.
👉 దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాల పాఠశాలల పెంపు,
-
2024-04-05T11:58:51+05:30
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
మేనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే, సోనియా, రాహుల్
న్యాయ్‌పత్ర-2024 పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
5 న్యాయ పథకాలు, 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
48 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన అగ్రనేతలు
-
2024-04-05T11:50:21+05:30
Congress Manifesto 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ పథకాలు, 25 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు.