Lok Sabha Elections: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:20 PM
జమ్మూకశ్మీర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల (Star campaigners) జాబితాను కాంగ్రెస్ (Congress) పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఐదు దశల్లో జమ్మూ-కశ్మీర్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున వీరు ప్రచారం సాగించనున్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచారకర్తలుగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 27 మంది ప్రముఖుల జాబితాలో అంబికా సోని, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, భరత్‌సింగ్ సోలంకి, వికార్ రసూల్ వని, జీఏ మీర్, తారిఖ్ హమీద్ కర్రా, సుఖ్వీందర్ సింగ్ సుఖు, రేవంత్ రెడ్డి, హరీష్ రావత్, ప్రమోద్ తివారీ, పవర్ ఖేర, రంజీత్ రంజన్, టీఎస్ సింగ్ దేవ్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, రాజ్ బబ్బర్, పీర్జాదా మహమ్మద్ సయీద్, మనోజ్ యాదవ్, తారాచంద్, రమన్ భల్లా, చౌదరి లాల్ సింగ్, జీఎన్ మోంగా, షమీమా రైనా, అకాష్ భరత్ కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న ఉదంపూర్, ఏప్రిల్ 26న జమ్మూ, మే 7న అనంతనాగ్-రాజౌరి, మే 13న శ్రీనగర్, మే 20న బారాముల్లా లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.