Share News

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

ABN , First Publish Date - Jun 01 , 2024 | 05:43 PM

Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
Lok Sabha Elections Exit Poll 2024 Results Live Updates

Live News & Update

  • 2024-06-01T21:30:41+05:30

    కేరళలో బోణీ కొట్టనున్న బీజేపీ..

    ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఈసారి కేరళ రాష్ట్రంలో బీజేపీ బోణీ కొట్టబోతోందని తెలుస్తోంది. అదే సమయంలో తమిళనాడులో డీఎంకే అలయన్స్ అధిక సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది.

  • 2024-06-01T21:05:53+05:30

    భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని

    ఎన్నికల సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేసిన భద్రతా దళాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. వారి వల్లే సురక్షితమైన వాతావరణం నెలకొందన్నారు. ప్రజలు సులభంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలు కల్పించాయన్నారు. దేశానికి వారు చేసిన సేవను మనలో ప్రతి ఒక్కరూ ఎంతో అభినందిస్తున్నారు అని ప్రధాని పేర్కొన్నారు.

  • 2024-06-01T20:40:24+05:30

    ఎగ్జాక్ట్ పోల్ కోసం ఎదురు చూస్తున్నాం..: కేటీఆర్

    ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్స్‌పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్ కోసం ఎదురు చూస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

  • 2024-06-01T20:30:06+05:30

    Exit Poll 2024 Live Updates: సీఎన్‌ఎక్స్‌ సర్వేలో రిపోర్ట్ ఇదే..

    ఎన్డీయే : 371- 401

    ఇండియా : 109- 139

    ఇతరులు : 28-38

  • 2024-06-01T19:38:44+05:30

    Exit Poll 2024 Live Updates: టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాష్ట్రాల వారీగా..

    ఉత్తారఖండ్

    బీజేపీ: 5+/-

    కాంగ్రెస్: 0-1+/-

    ఇతరులు: 0

    గుజరాత్

    బీజేపీ: 26+/-2

    కాంగ్రెస్: 0,+/-2

    ఇతరులు: 0

    ఛత్తీస్‌గఢ్

    బీజేపీ: 11+/-1

    కాంగ్రెస్: 0,+/-1

    ఇతరులు: 0

    అస్సాం

    బీజేపీ: 12+/-2

    కాంగ్రెస్: 1+/-1

    ఢిల్లీ

    బీజేపీ: 6+/-1

    కాంగ్రెస్: 1+/-1

    ఇతరులు: 0

    మధ్యప్రదేశ్

    బీజేపీ: 29+/-2

    కాంగ్రెస్: 0,+/-2

    ఇతరులు: 0

    హర్యానా

    బీజేపీ: 6+/-2

    కాంగ్రెస్: 4+/-2

    ఇతరులు: 0

    హిమాచల్ ప్రదేశ్

    బీజేపీ: 4+/-1

    కాంగ్రెస్: 0,+/-1

    ఇతరులు: 0

    జార్ఖండ్

    బీజేపీ: 12+/-2

    కాంగ్రెస్: 2+/-2

    ఇతరులు: 0

    రాజస్థాన్

    బీజేపీ: 22+/-3

    కాంగ్రెస్: 2+/-2

    ఇతరులు: 1+/-1

  • 2024-06-01T19:28:11+05:30

    Exit Poll 2024 Live Updates: న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్..

    న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణలో ప్రధాన పార్టీ ఎన్ని సీట్లు గెలవనున్నాయో చూద్దాం.

    కాంగ్రెస్: 5-8

    బీజేపీ: 7-10

    బీఆర్ఎస్: 2-5

    ఎంఐఎం: 1

  • 2024-06-01T19:24:46+05:30

    Exit Poll 2024 Live Updates: ఆరా సర్వే అంచనాలు

    తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆరా సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో బిజెపి మొదటి స్దానంలో నిలవగా.. కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం మూడోస్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో బీఆర్ఎస్ ఉంది.

    కాంగ్రెస్ 7-8 సీట్లు

    బిజేపి 8-9 సీట్లు

    MIM 1 సీటు

    BRS 0 సీట్లు

  • 2024-06-01T19:22:55+05:30

    Exit Poll 2024 Live Updates: టీవీ9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్..

    తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందనే విషయంలో టీవీ9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించింది. మరి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూద్దాం.

    కాంగ్రెస్ 8

    బీజేపీ 7

    బీఆర్ఎస్ 1

    ఎంఐఎం 1

  • 2024-06-01T19:10:26+05:30

    Exit Poll 2024 Live Updates: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

    తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తున్నాయనేది ఏబీపీ సీ-ఓటర్స్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం..

    BJP: 7-9 seats

    Congress: 7-9 seats

    AIMIM: 0-1 seats

  • 2024-06-01T19:02:39+05:30

    Exit Poll 2024 Live Updates: జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్ వచ్చేసింది..

    ఎన్డీయే: 377, +/-15

    ఇండియా కూటమి: 151+/-10

    ఇతరులు: 15 +/-5

  • 2024-06-01T18:57:21+05:30

    Exit Poll 2024 Live Updates: ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లెక్కలివే..

    కేరళ:

    ఎన్డీఏ 2 -3

    యూడీఎఫ్ 17-18

    ఎల్డీఎఫ్: 0 - 1

    కర్ణాటక:

    ఎన్డీఏ 23 -24

    ఇండియా 3-5

    ఇతరులు: 0

    తమిళనాడు:

    ఎన్డీయే 2-4

    ఏఐఏడీఎంకే: 0 -2

    ఇండియా 33 - 37

    ఇతరులు : 0

  • 2024-06-01T18:54:42+05:30

    Exit Poll 2024 Live Updates: కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు?

    ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పోల్స్ ప్రకారం, కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ 20-22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

    బీజేపీ: 20 - 22

    జేడీఎస్: 2-3

    కాంగ్రెస్: 3-5

    2023లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. అక్కడ నెలకొన్న పరిస్థితులు బీజేపీకి లాభం చేకూర్చాయని సర్వే సంస్థ అంచనా వేసింది.

  • 2024-06-01T18:52:37+05:30

    Exit Poll 2024 Live Updates: రిపబ్లిక్-మాట్రిజ్ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

    ఎన్డీయే - 353-368

    ఇండియా కూటమి - 118 - 13

    ఇతరులు - 43 - 48

  • 2024-06-01T18:50:06+05:30

    Exit Poll 2024 Live Updates: తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..

    తమిళనాడులో బీజేపీ 1-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా పోల్ పేర్కొంది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ ప్రకారం తమిళనాడులో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో వివరాలివే..

    బీజేపీ: 1-3 సీట్లు

    డీఎంకే: 20-22

    కాంగ్రెస్: 6-8

    ఏఐఏడీఎంకే: 21

  • 2024-06-01T18:27:00+05:30

    ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు విడుదలవుతాయి?

    జూన్ 1 శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్‌లను విడుదల చేయనున్నాయి. ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సర్వే సంస్థలన్నీ 6.30 గంటల తరువాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయనున్నాయి.

  • 2024-06-01T18:17:10+05:30

    ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?

    ఎగ్జిట్ పోల్ అనేది ఎన్నికల అనంతరం నిర్వహించే సర్వే. ఇది దేశం ప్రజల అభిప్రాయాన్ని, మానసిక స్థితిని అంచనా వేస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న అభిప్రాయ సేకరణ ఇది. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అధికారిక ఎన్నికల ఫలితాలతో సమానంగా ఉండవనేది సత్యం. అధికారిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలను 2024 జూన్ 4న భారత ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.

  • 2024-06-01T17:40:38+05:30

    Lok Sabha Election 2024 Exit Poll Results Highlights in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు..? ప్రజలు పట్టం కట్టేదెవరికి..? పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీకి(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేదంటే ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఉత్కంఠకు పూర్తిస్థాయి తెర పడాలంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. అయితే, అంతకు ముందే.. ఓటరు నాడిని పసిగట్టి.. ఓటర్లు ఎవరిని ఎన్నుకున్నారు? ఓటు ఎవరికి పడింది. ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపారు? అనే అంశాన్ని ఎగ్జిట్ పోల్(Exit Poll 2024) తేల్చనుంది.

    అవును.. తుదిదశ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. పోలింగ్ ముగిసిన కాసేపటికే అంటే 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ప్రముఖ సంస్థలన్నీ ఇప్పటికే ప్రజల నాడిని పసిగట్టాయి. ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపారనేది మరికాసేపట్లో వెల్లడించనున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి మెజార్టీ చూపుతాయనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.