Share News

Lok Sabha Elections: 'ప్రేమ దుకాణం'లో నకిలీ వీడియోల అమ్మకం.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:52 PM

'డీప్ ఫేక్' వీడియోలపై విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలను విపక్షాలు సర్క్యులేట్ చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.

Lok Sabha Elections: 'ప్రేమ దుకాణం'లో నకిలీ వీడియోల అమ్మకం.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

ముంబై: 'డీప్ ఫేక్' వీడియోలపై విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలను విపక్షాలు సర్క్యులేట్ చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలను సృష్టించడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశ్తూ, విపక్షాలు ప్రధానంగా తనను టార్గెట్ చేస్తు్న్నాయని అన్నారు. ''ఇప్పుడు వారి అబద్ధాలు ఎవరూ నమ్మడం లేదు. దానితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నా ఫేస్ ఉపయోగించుకుని తమ ప్రేమ దుకాణాల్లో అమ్మకానికి పెడుతున్నారు'' అని మోదీ విమర్శించారు.

Lok Sabha Elections: 400 సీట్ల లక్ష్యం సాధిస్తాం: రాజ్‌నాథ్ సింగ్


జాతి ఆత్మగౌరవ ఎన్నికలు

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు జాతి ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని ప్రధానమంత్రి అభివర్ణించారు. బలహీన ప్రభుత్వం ఏర్పడితే అది ఎప్పుడైనా కూలిపోతుందని అన్నారు. ఆరు దేశాబ్దాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న నీటి సరఫరా సవాళ్లను కాంగ్రెస్ సమర్ధవంతంగా పరిష్కరించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం నీటి సరఫరా మౌలిక వసతుల మెరుగుకు సమర్ధవంతంమైన చర్యలు తీసుకుందని వివరించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 03:52 PM