Share News

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు

ABN , Publish Date - May 03 , 2024 | 01:49 PM

సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13 న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌‌లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 454 మంది పోటీ చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 525 మంది పోటీ చేస్తున్నారు.

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Polls 2024) 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13 న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌‌లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 454 మంది పోటీ చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 525 మంది పోటీ చేస్తున్నారు. బీహార్‌లో 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 55 మంది పోటీ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఒక్క పార్లమెంటు స్థానానికి పోలింగ్ జరగనుంది. బరిలో 24 మంది ఉన్నారు.

Pensions: తగ్గని పెన్షనర్ల కష్టాలు.. బ్యాంకుల వద్ద నరకం చూస్తున్న వృద్ధులు


జార్ఖండ్‌లో 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఇక్కడ 45 మంది పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వస్తే.. 8 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. 74 మంది పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బరిలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. బరిలో 130 మంది అభ్యర్థులు నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 8 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్

Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 01:49 PM