Ayodhya: సీతమ్మకు కైకేయి కానుక.. అయోధ్యలో ఇప్పటికీ నిలిచిఉన్న భవనం..
ABN , Publish Date - Jan 12 , 2024 | 08:34 AM
అయోధ్య.. ఈ పేరు చెబితే చాలు యావత్ భారతమంతా పులకించిపోతుంది. రాముడు తనవాడే అంటూ అక్కున చేర్చుకుంటుంది.
అయోధ్య.. ఈ పేరు చెబితే చాలు యావత్ భారతమంతా పులకించిపోతుంది. రాముడు తనవాడే అంటూ అక్కున చేర్చుకుంటుంది. అలాంటి అనుబంధం ఉన్న అయోధ్యలో రాముడి మందిర ప్రారంభోత్సవ ఘడియలు దగ్గర పడుతున్నాయన్న భక్తి భావం అందరిలో నెలకొంది. అయోధ్యలో సీతారాముల వ్యక్తిగత భవనమూ ఉంది. ఈ భవనాన్ని కైకేయి.. తన కోడలు సీత కోసం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నారు. అయోధ్య నగరానికి ఈశాన్యంలో ఉన్న ఈ భవనాన్ని కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారు. కాగా.. ఈ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్‌గా ఉండేది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దానిని ఆధునికీకరించాడని, విక్రమాదిత్యుడు తిరిగి నిర్మించాడని చెబుతుంటారు. విక్రమాదిత్యుడి అనంతరం ఓర్చా మహారాణి కున్వారీ.. ఈ భవనానికి మరమ్మతులు చేయించారు. ఆ మహల్‌లో సీతారాముల విగ్రహాలు పూజలందుకొంటున్నాయి.
కాగా.. శ్రీరామునికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో దశరధుని భార్య కైకేయి రెండు వరాలు కోరింది. ఒకటి రాముడు 14 ఏళ్లు వనవాసం చేయడం. రెండోది భరతుడు అయోధ్యకు రాజు అవడం. భార్య కోరికతో దుఖసాగరంలో మునిగిపోయిన దశరథుడి మాట కాదనలేక రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. అయితే.. కైకేయి అలా కోరడం వెనక కారణం మంధర అనే విషయం అందరికీ తెలిసిందే.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.