Shocking: పగబట్టిందా ఏంటీ? ఆరుసార్లు ఆమెనే కాటేసిన పాము.. ఎక్కడంటే..
ABN , Publish Date - May 30 , 2024 | 08:54 PM
దేశ వ్యాప్తంగా యేటా వేలాది మంది ప్రజలు పాము కాటుకు గురై చనిపోతున్నారు. పాము కాటుకు సరైన వైద్యం, మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఊర్లలో ఎవరైనా పాముకు గురైతే..
మధ్యప్రదేశ్, మే 30: దేశ వ్యాప్తంగా యేటా వేలాది మంది ప్రజలు పాము కాటుకు గురై చనిపోతున్నారు. పాము కాటుకు సరైన వైద్యం, మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఊర్లలో ఎవరైనా పాముకు గురైతే.. సకాలంలో ఆస్పత్రికి తరలించి చికత్స అందించాలి. లేదంటే.. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. పాము కాటుకు గురైన వ్యక్తిని చేర్పించిన ఆస్పత్రిలో తగిన మందులు, సకాలంలో చికిత్స అందితే.. ప్రాణాలతో బయటపడొచ్చు. లేదంటే అంతే సంగతి. పాము కాటు ప్రాణంతకం. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మరణానికి కారణమవుతుంది.
తాజాగా మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను పాము ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరుసార్లు కాటేసింది. అయితే, అదృష్టావశాత్తు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించడం, చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెను ఒకేసారి ఆరుసార్లు కరవలేదు. ఆరేళ్లలో ఏడాదికి ఒకసారి పాము కాటు వేసింది.
మధ్యప్రదేశ్‌లోని కట్నీ సమీపంలో ఈ ఘటన జరిగింది. బహోరీబంద్ తహసీల్‌లోని గుణబచయ గ్రామానికి చెందిన పూజా వ్యాస్.. ఆరేళ్లలో ఆరుసార్లు పాము కాటుకు గురైంది. అయితే, అదృష్టావశాత్తు ప్రతిసారి ఆమె ప్రాణాలతో బయటపడింది. తాజాగా ఇటీవల కూడా పూజను పాము కాటు వేసింది. ఇంట్లో పని చేస్తుండగా.. ఇంట్లోకి వచ్చిన పాము ఆమెను కాటు వేసింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. యాంటీవీనమ్ డోస్ ఇచ్చి సకాలంలో చికిత్స అందించడంలో పూజ బ్రతికిబయటపడింది. ప్రస్తుతం ఆమెను జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఏడాది వ్యవధిలో 13సార్ల పాము కాటు..
ఇదే మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మాండ్లా జిల్లాలో సావిత్రి దూబే ఏడాది వ్యవధిలో ఏకంగా 13సార్లు పాము కాటుకు గురైంది. సకాలంలో వైద్యం అందించడం వల్ల ప్రతిసారీ ఆమె ప్రాణాలతో బయటపడింది. రకరకాల పాములు ఆమెను కాటు వేశానని సావిత్రి చెప్పుకొచ్చింది.