Share News

Maharashtra: సీఎం పోస్టుపై ఫార్ములా.. అజిత్ పవార్ ఏమన్నారంటే

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:51 PM

సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు.

Maharashtra: సీఎం పోస్టుపై ఫార్ములా.. అజిత్ పవార్ ఏమన్నారంటే

ముంబై: 'మహాయుతి' కూటమి 236 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం సీటుకు సంబంధించి ఏదైనా ఫార్ములాపై చర్చ జరుగుతోందా అనే విషయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సోమవారంనాడు స్పందించారు. అలాంటి ఫార్ములా ఏదీ చర్చకు రాలేదని ఆయన చెప్పారు. మహాయుతి ప్రభుత్వానికి పట్టం కడుతూ ప్రజలు చాలా గట్టి తీర్పునిచ్చారని, అసెంబ్లీ విపక్ష నేత పదవికి అవసరమైన సంఖ్యాబలం కూడా 'మహా వికాస్ అఘాడి'కి రాలేదని చెప్పారు.

Maharashtra Congress: మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా


"ఏ ఫార్ములాపై చర్చ జరగడం లేదు. మేము ముగ్గురూ (కూటమి) కలిసి సీఎం పదవిపై చర్చిస్తాం. అసెంబ్లీలో ఎన్‌సీపీ నేతగా నన్ను ఎన్నుకున్నారు. శివసేన తరఫున ఏక్‌నాథ్ షిండే ఎన్నికయ్యారు. బీజేపీ కూడా ఇదే చేసింది. మేము కలిసి చర్చించుకుని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'' అని అజిత్ పవార్ తెలిపారు.


రేసులో ఫడ్నవిస్ ముందంజ

సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు. సీఎం ఎవరనేది అంతిమంగా ఢిల్లీలో నిర్ణయిస్తారని, చర్చలు జరుగుతున్నందున ఫలితం ఏమిటనేది వేచిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున దానిని కూడా సీఎం ఎంపిక విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంగళవారానికి ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.


ఢిల్లీలో కీలక సమావేశం

సీఎం పీఠంపై తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఢిల్లీలో సోమవారం 'మహాయుతి' అగ్రనేతలతో సమావేశం ఏర్పాటైంది. హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం హాజరవుతున్నారు. సమావేశానంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.


Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 25 , 2024 | 02:51 PM