Share News

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:01 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అంటే నిన్నటితో ముగిసింది. బుధవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరించుకునే గడువు నవంబర్ 4వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో.. నవంబర్ 20వ తేదీన జరగనుంది.

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

ముంబయి, అక్టోబర్ 30: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 148 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 103 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మహాయుతి కూటమిలో భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన పార్టీ 80 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 53 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే మిత్ర పక్షాలకు ఐదు స్థానాలను మహాయుతి కూటమి కేటాయించింది. మరో రెండు స్థానాలపై కూటమికి స్పష్టత రాలేదు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపలేదు.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


ఇక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ పార్టీ 103 స్థానాల్లో అభ్యర్థులను నిలుపింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 89 స్థానాల్లో.. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 87 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే మిత్ర పక్షాలకు ఆరు అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. మరో మూడు స్థానాలపై ఈ భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టత రాలేదు. దీంతో వాటిలో అభ్యర్థులను పోటికి దింపలేదు.

Also Read: Choti Diwali 2024: చోటి దీపావళి వేళ.. ఇలా..


మహారాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 288 స్థానాలున్నాయి. నవంబర్ 20వ తేదీ.. వాటికి ఒకే విడతలో ఎన్నికలు జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 7,995 మంది అభ్యర్థులు పోటి చేస్తున్నారు. ఆ క్రమంలో 10,905 నామినేషన్లను సమర్పించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. ఇక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4వ తేదీ అంటే గురువారం సాయంత్రం 3.00 గంటలకు ముగియనుంది.

Also Read: Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు


మరోవైపు దేశంలోని అతి పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది స్పష్టమవుతుంది.

Also Read: ICAI: నేడు సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల


ఇంకోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒకే సారి షెడ్యూల్ విడుదల చేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 13వ తేదీన.. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23వ తేదీన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

For National News And Telugu News...

Updated Date - Oct 30 , 2024 | 01:07 PM