Maharashtra Elections: ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్ చేశారు.. అజిత్ వర్గంపై కాంగ్రెస్ ఫైర్
ABN , Publish Date - Oct 26 , 2024 | 06:30 PM
ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేయడం ఫిరాయింపుదారుల చట్టం కిందకు వస్తుందని, దీనిపై హోం శాఖ ఇన్‌చార్జిగా ఉన్న ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ షిండే) ఎందుకు మౌనంగా ఉన్నారుని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రమేష్ చెన్నితాల ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) వేళ మరోసారి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కోట్ల రూపాయలు ఎర చూపుతున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అజిత్ పవార్ (Ajit Pawar) సారథ్యంలోని ఎన్‌సీపీలోకి చేరాలని తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. న్యూఢిల్లీలో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి రమేష్ చెన్నెతాల ఆ ఆరోపణలు చేశారు. ఇది సిగ్గుచేటైన వ్యవహారమని అన్నారు.
Maharshta Elections: పోటీలో లేని ఆప్... 'ఇండియా' కూటమి అభ్యర్థులకు కేజ్రీవాల్ ప్రచారం
"ఎన్‌సీపీలోకి చేరాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇది ఫిరాయింపుదారుల చట్టం కిందకు వస్తుంది. దీనిపై హోం శాఖ ఇన్‌చార్జిగా ఉన్న ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ షిండే) ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు ఏమి జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది'' అని చెన్నితాల ప్రశ్నించారు. ముడుపులు ఇవ్వచూపడం, తీసుకోవడం రెండూ కూడా నేరపూరిత చర్యలు కిందే వస్తాయని అన్నారు. కాగా, చెన్నితాల ఆరోపణలపై అజిత్ పవార్ ఎన్సీపీ ఇంకా స్పందించలేదు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్‌సీపీతో కూడిన 'మహాయుతి కూటమి', ఉద్ధవ్ థాకరే సారథ్యంలోనే శివసేన, శరద్ పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కూడిన 'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడంతో పాటు 'మహావికాస్ అఘాడి' అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ప్రచారానికి నిర్ణయించింది. 288 సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..
Read More National News and Latest Telugu News