Eknath Shinde: వైరల్ ఫీవర్‌తో షిండేకు అస్వస్థత
ABN , Publish Date - Nov 30 , 2024 | 06:50 PM
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబైలో అన్ని కార్యక్రమాలను షిండే రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో మహాయుతి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటనే సస్పెన్స్ మరింత తీవ్రమైంది.
సతారా: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అస్వస్థతకు గురయ్యారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. షిండే ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగ్గానే ఉందని ఆయన కుటుంబ వైద్యుడు పర్తే తెలిపారు. జ్వరం 99 డిగ్రీల సెల్సియస్ ఉందని, సెలైన్ ఇచ్చామని, వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు కొద్దిగా జలుపు, దగ్గు చేసిందని చెప్పారు.
EC invites Congress: మీ అనుమానాలు నివృత్తి చేస్తాం.. కాంగ్రెస్ ప్రతినిధులకు ఈసీ పిలుపు
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబైలో అన్ని కార్యక్రమాలను షిండే రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో మహాయుతి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటనే సస్పెన్స్ మరింత తీవ్రమైంది. కొత్త క్యాబినెట్లో షిండేకు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వాలని శివసేన షిండే శనివారంనాడు బహిరంగంగానే తమ డిమాండ్‌ను ప్రకటించింది. తమ డిమాండ్‌లో ఎలాంటి తప్పూ లేదని కూడా స్పష్టం చేసింది.
దీనికి ముందు, గత గురువారం రాత్రి ఢిల్లీలో అమిత్‌షాను షిండే కలిసారు. మహాయుతి సర్కార్‌లో అధికార పంకాలపై చర్చలు జరిపారు. అనంతరం షిండే మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు తాను అడ్డంకి కాదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ముంబైలో కూడా 'మహాయుతి' కూటమి నేతలు తదుపరి చర్చలు జరుపుతారని అన్నారు. అనంతరం ఆయన ముంబై చేరుకున్నప్పటికీ సమావేశాలను రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లారు. ఫడ్నవిస్ ప్రభుత్వంలో శివసేనకే హోం శాఖ ఉంటే తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను మరింత ముందుకు తీసుకువెళ్లే బలమైన అవకాశం ఉంటుందని షిండే ఆలోచనగా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Eknath Shinde: షిండే అలక వెనుక కారణం ఇదే
Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు
Suburban trains: ఇక.. సబర్బన్ రైళ్లకు ఏసీ బోగీలు
Read More National News and Latest Telugu News