Share News

Maharashtra : నిత్యకల్యాణం... నగలతో పలాయనం

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:34 AM

విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి వితంతువులే లక్ష్యంగా మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో అతను వివరాలు పెడతాడు. ఎవరైనా ఆకర్షితులైతే స్నేహం చేసి పెళ్లి చేసుకుంటాడు.

Maharashtra : నిత్యకల్యాణం... నగలతో పలాయనం

  • 20 మంది మహిళలతో వివాహం

  • మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన

  • నిత్య పెళ్లికొడుకు ఫిరోజ్‌ నియాజ్‌

పాల్‌ఘర్‌, జూలై28: విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి వితంతువులే లక్ష్యంగా మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో అతను వివరాలు పెడతాడు. ఎవరైనా ఆకర్షితులైతే స్నేహం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆపై భాగస్వామికి చెందిన నగానట్రా తీసుకుని పరారవుతాడు.

ఇలా ఏకంగా 20మంది మహిళల్ని మోసం చేసి పెళ్లిచేసుకున్నాక విలువైన వస్తువులతో ఉడాయించిన ఓ నిత్య పెళ్లికొడుకుని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ బాధితురాలు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులో కొచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఫిరోజ్‌ నియాజ్‌ షేక్‌ (43)ను బాధిత మహిళ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా కలిసింది. తర్వాత అతన్ని పెళ్లిచేసుకుంది. 2023 నవంబరులో ఆమె తాలూకు నగదు, ల్యాప్‌టాప్‌, ఇతరత్రా రూ.6.5లక్షల విలువైన వస్తువులతో షేక్‌ ఉడాయించాడు.

నిందితుడు థానేలోని కల్యాణ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు... పాల్‌ఘర్‌ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం తెలిపారు. 2015నుంచి ఇప్పటిదాకా 20 మందిని అతను పెళ్లిచేసుకున్నాడన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 04:35 AM