Maharashta Polls: నగదు పంపిణీ వివాదం... బీజేపీ నేత వినోద్ తావ్డేపై ఎఫ్ఐఆర్
ABN , Publish Date - Nov 19 , 2024 | 09:34 PM
ఓటర్లకు డబ్బుల పంపిణీలో తావ్డే, రాజన్ నాయక్ ప్రమేయంపై ఈసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు చెప్పారు. హోటల్‌లో డబ్బులు పంపిణీ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నామని, హోటల్ పర్మిసెస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చట్టవిరుద్ధమని, వీటిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది గంటల్లో జరుగనున్న తరుణంలో పాల్ఘర్ జిల్లాలోని ఓటర్లకు మంగళవారంనాడు డబ్బుల పంపిణీ చేశారన్న ఆరోపణల కింద బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే (Vinod Tawde)పై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనతో పాటు పార్టీ నలసోపర నియోజకవర్గం అభ్యర్థి రాజన్ నాయక్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ
ఓటర్లకు డబ్బుల పంపిణీలో తావ్డే, రాజన్ నాయక్ ప్రమేయంపై ఈసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు చెప్పారు. హోటల్‌లో డబ్బులు పంపిణీ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నామని, హోటల్ పర్మిసెస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చట్టవిరుద్ధమని, వీటిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
విరార్ హోటల్ రూమ్‌లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బహుజన్ వికాస్ అఘాడి నేతలు అక్కడకు చేరుకుని బ్యాగ్‌లో ఉంచిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో తావ్డే అక్కడే కొద్దిదూరంగా కూర్చున్నారు. తావ్డేకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చే సమయానికి పలువురు వీడియోలు తీశారు. తావ్డే డబ్బులు పంచారంటూ అఘాడి నేతలు ఆరోపించగా, బీజేపీ నేతలు ఆ ఆరోపణలను కొట్టివేశారు. కేవలం బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు తావ్డే అక్కడున్నారని వారు వాదించారు.
40 ఏళ్లు రాజకీయల్లో ఉన్నా...
కాగా, తనపై వచ్చిన క్యాష్-ఫర్-ఓట్స్ ఆరోపణలను వినోద్ తావ్డే కొట్టివేశారు. వాసై-విహార్ వైపు వెళ్తుండగా టీ తాగేందుకు రమ్మని తనను రాజన్ నాయక్ కోరారని చెప్పారు. 200 నుంచి 250 మంది బూత్ ఇన్‌చార్జులు అక్కడ సమావేశమయ్యారని చెప్పారు. ఆ తర్వాతే హితేంద్ర ఠాకూర్, ఆయన కుమారుడు రావడం, వాళ్ల పార్టీ కార్యకర్తలు గలభా సృష్టించడం జరిగిందన్నారు. పార్టీ కోసం రేయింబవళ్లు పనిస్తున్న కార్యకర్తలను తాను కలుసుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. 40 ఏళ్లగా తాను రాజకీయాల్లో ఉంటున్నానని, డబ్బుకు సంబంధించిన వ్యవహారంపై తనపై ఒక్క కేసు కూడాలేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి
అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్ బిష్ణోయ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..