Mamata Banerjee: దురాక్రమణకు వస్తే భారతీయులు లాలీపాప్ తింటూ కూర్చుంటారా?.. దీదీ ఫైర్
ABN , Publish Date - Dec 09 , 2024 | 06:48 PM
బంగ్లాదేశ్‌లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
కోల్‌కతా: బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ నేతలు భారత భూభాగాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. బెంగాల్, ఒడిశా, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామంటూ వారు చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తాజాగా నిప్పులు చెరిగారు. విదేశీ శక్తులు భారత భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే భారతీయులు 'లాలీపాప్'లు తింటూ కూర్చుంటారా? అని ప్రశ్నించారు.
PM Modi: మహిళలకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ బీమా సఖి యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా పశ్చిమబెంగాల్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ కమ్యూనిటీలకు పశ్చిమబెంగాల్ సంఘీభావం తెలుపుతోందని, సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. ''హిందువులు, ముస్లింలు సహా అందిరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి తీవ్రతరం కాకుండా అంతా కలిసికట్టుగా ఉండాలి'' అని మమతా బెనర్జీ కోరారు.
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుండటాన్ని మమతా బెనర్జీ ప్రస్తావిస్తూ, బంగ్లాదేశ్ అధికారులతో ఆయన అత్యున్నత స్థాయి భేటీ జరుపుతున్నారని, ఇక్కడి వారు అనవసరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి..