Train collision: బెంగాల్ రైలు ప్రమాదంపై మమతాబెనర్జీ దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:21 PM
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West bengal) లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా వస్తున్న గూడ్సు రైలు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెనుక వైపు ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రంగపాణి, నిజ్‌బరి స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ధ్రువీకరించారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు మమతా బెనర్జీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. డీఎం, ఎస్‌పీ, డాక్టర్లు, అంబులెన్స్‌లు, డిజాస్టర్ టీమ్‌లు సహాయక చర్యల కోసం ఘటనా స్థలికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు.
Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు
ఎక్కువ మంది అసోం వారే..
ప్రమాదానికి గురైన రైలులో ఎక్కువ మంది అసోం వారే ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ తెలిపారు. ప్రమాద ఘటనలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడాడని చెప్పారు. త్రిపు నుంచి అసోం మీదుగా రైలు ప్రయాణిస్తోందని, అసోం ప్రయాణికులే ఎక్కువ మంది ఉండటంతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అవసరమైన అన్నిరకాల సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Read Latest National News and Telugu News