Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేస్తారా..?
ABN , Publish Date - Aug 14 , 2024 | 09:20 PM
ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.
కోల్ కతా: ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.
ఏం చేయలేదు..
‘వైద్యురాలి మృతికి సంబంధించి తమ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ఆ రోజు రాత్రి కేసు ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. కేసు గురించి నాకు పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వివరించారు. మృతురాలి తల్లిదండ్రులతో నేను మాట్లాడాను. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని వారితో చెప్పా. నిందితుడిని ఉరితీస్తామని స్పష్టం చేశా. హత్య కేసులో మా ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు. మేం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని’ మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
రాత్రంతా ఫోన్ మాట్లాడా
‘ఘటన జరిగిన రోజు రాత్రంతా కేసు గురించి అధికారులతో మాట్లాడా. మృతురాలి అంత్యక్రియలు జరిగే వరకు కేసు గురించి అధికారులు నాకు ఫోన్ చేశారు. మృతురాలి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారని వెల్లడించారు. త్వరగా నిందితుడిని పట్టుకోవడంతో కోల్ కతా పోలీసులను అభినందించా. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడం, డీఎన్ఏ సేకరించడం లాంటి కఠినమైన సవాళ్లను పోలీసులు ఎదుర్కొన్నారు. త్వరగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు విషయంలో కోల్ కతా హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో కేసును సీబీఐ అధికారులకు అప్పగిస్తున్నాం అని’ మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు
వైద్యురాలి ఘటనకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ వివరించారు. హత్యకు సంబంధించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఆదివారం లోపు ఛార్జీ షీట్ దాఖలు చేయకుంటే కేసును సీబీఐ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఇంతలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు.
Read More National News and Latest Telugu News