Mamata Benerjee : ఆదివారంలోగా కేసును తేల్చేయాలి
ABN , Publish Date - Aug 17 , 2024 | 04:35 AM
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత రాజీనామా చేయాలంటూ శుక్రవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు చేపట్టింది. బెంగాల్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని..
కోల్‌కతా, న్యూఢిల్లీ, ఆగస్టు 16: జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత రాజీనామా చేయాలంటూ శుక్రవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు చేపట్టింది. బెంగాల్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని.. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించింది. అయితే బీజేపీ డిమాండ్‌ను టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ తప్పుబట్టారు. మరోవైపు.. జూనియర్ వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని..
హత్యాచార దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీఎం మమత శుక్రవారం కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్య వెనుక వాస్తవాలను మరుగన పరిచేందుకే బీజేపీ, సీపీఎం కలిసి ఆర్జీ కర్ ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డాయని మమత ఆరోపించారు. హత్యాచారం కేసును ఆదివారంలోగా సీబీఐ అధికారులు తేల్చేయాలని.. దోషులను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.