Share News

Mamata Banerjee: బీమా ప్రీమియంపై జీఎస్‌టీ.. నిర్మలా సీతారామన్‌కు మమత లేఖ

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:56 PM

జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.

Mamata Banerjee: బీమా ప్రీమియంపై జీఎస్‌టీ.. నిర్మలా సీతారామన్‌కు మమత లేఖ

కోల్‌కతా: జీవిత బీమా, ఆరోగ్య బీమా (Life insurance, health insurence)పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ (GST) విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamamta Banerjee) కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మమతా బెనర్జీ లేఖ రాశారు. లైఫ్, హెల్త్ బీమాల ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం, ఊహించని ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, మరణాలు సంబవించినప్పుడు వారికి అండగా నిలబడటమని సీఎం పేర్కొన్నారు.


''జీవిత బీమా, ఆరోగ్య బీమా పథకాలు/ప్రాడక్ట్‌‌లపై 18 శాతం జీఎస్‌టీ విధించడానికి సంబంధించి తీవ్ర ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. బీమా ప్రీమియంలు పెంచడం వల్ల సామాన్య ప్రజానీకంగా ఆర్థిక భారం పడుతుంది. ఇందువల్ల కొత్త పాలసీలు తీసుకునేందుకు, ఉన్న పాలసీలను కొనసాగించేందుకు ప్రజలు వెనుకంజ వేస్తారు. ఇది వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ ప్రజావ్యతిరేక పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి జీవిత, ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంపై జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను'' అని మమత ఆ లేఖలో పేర్కొన్నారు. బీమా పథకాల ప్రీమియంపై జీఎస్‌టీ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించకుంటే తమ పార్టీ ఆందోళనలకు దిగుతుందని మమత గురువారంనాడు ప్రకటించారు.

Delhi coaching centre horror: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం


దీనికి ముందు గడ్కరి సైతం...

కాగా, ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సైతం ఇటీవల నిర్మలా సీతామన్‌కు లేఖ రాశారు. జీవిత, మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్‌టీ ఉపసంహరించుకోవాలని మంత్రిని కోరారు. కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల నుంచి ఆర్థిక మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నితిన్ గడ్కరి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Latest National News And Telugu News

Updated Date - Aug 02 , 2024 | 05:57 PM