Manipur: 1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారి తరలింపు సాధ్యమేనా..?
ABN , Publish Date - Feb 14 , 2024 | 09:13 AM
1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారిని తరలిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోమవారం (నిన్న) ప్రకటన చేశారు. కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాంతో మణిపూర్‌లో అక్రమంగా తలదాచుకున్న వారిని తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత ఏడాది రెండు తెగల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. గొడవకు కారణం ఓ తెగ అని మణిపూర్ (Manipur) ప్రభుత్వం చెబుతోంది. ఆ తెగ వారు దేశానికి చెందిన వారు కాదని, పొరుగున గల మయన్మార్ నుంచి వచ్చారని స్పష్టం చేసింది. వారి వల్లే రాష్ట్రంలో అశాంతి నెలకొందని తేల్చి చెప్పింది. 1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారిని తరలిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోమవారం (నిన్న) ప్రకటన చేశారు. కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాంతో మణిపూర్‌లో అక్రమంగా తలదాచుకున్న వారిని తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
వెల్ కం.. కానీ
సీఎం బీరెన్ సింగ్ ప్రకటనను మేధావులు స్వాగతించారు. అదే సమయంలో రాష్ట్రంలో అక్రమంగా ఉంటోన్న వారి తరలింపుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆ వలసదారులను సంబంధిత విదేశం తమ పౌరులుగా గుర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలా జరగకుంటే వారిని ఇక్కడి నుంచి తరలించడం కష్టం అని అభిప్రాయ పడ్డారు. సమస్య మరింత జటిలంగా మారుతుందని మణిపూర్ ప్రభుత్వానికి సూచించారు.
గుర్తించడం కష్టం
‘మణిపూర్‌లో అక్రమ వలసదారులను గుర్తించడం కష్టం. వలసదారుల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా చేయలేదు. అక్రమ వలసదారులకు ఇక్కడ నివసించే హక్కు ఉండకూడదు. ఓటు వేసే అవకాశం ఉండొద్దు అని’ నాగా నేత, శాంతి స్థాపన కన్వీనర్ అశాంగ్ కషర్ అభిప్రాయ పడ్డారు. వలసదారుల్లో చాలా మంది దశాబ్దాలుగా మణిపూర్‌లో ఉంటున్నారు. ఇప్పటికే సహజ పౌరులుగా మారారు. వారిని బహిష్కరించే సమయంలో చట్టపరంగా ఉన్న చిక్కులను తొలగించుకోవాల్సి ఉంటుందని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.