Share News

Maharashtra: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతదేహాల గుర్తింపు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:38 AM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు.

Maharashtra: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతదేహాల గుర్తింపు..

  • మృతులపై రూ.86 లక్షల రివార్డు

  • బీజాపూర్‌లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్ల మృతి

చర్ల, బీజాపూర్‌, మహదేవపూర్‌, జూలై 18: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. నక్సల్స్‌ మృతదేహాలను మహారాష్ట్ర బలగాలు బుధవారం అర్ధరాత్రి గడ్చిరోలికి తరలించాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఏరియా కమిటీ సభ్యులు, డివిజన్‌ కమిటీ, దళ సభ్యులు ఉన్నారు. డీవీఎంసీ సభ్యులైన యోగేశ్‌ దావ్‌సింగ్‌, ప్రమోద్‌ లాల్సే కచ్లామి, విశాల్‌ కుల్లే ఆత్రంలపై తలా రూ.16 లక్షల రివార్డు ఉంది. అలాగే ఏరియా కమిటీ సభ్యులైన మహార్‌ ధోబీ, అనిల్‌ దేవ్‌సే, విజ్జు, సరితా, రాజ్జోలపై ఒక్కొక్కరి మీద రూ.6 లక్షల రివార్డు.. రోజా, సాగర్‌, సీతాహాక్‌, చందం పోద్యంలపై తలా 2 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వీరి నుంచి అధునాతన తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.


కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చి ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీశారు. బీజాపూర్‌, సుక్మా, దంతేవాడ జిల్లా సరిహద్దులో కూంబింగ్‌ నిర్వహించి వస్తున్న భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ‘‘బుధవారం రాత్రి సోదాలు ముగించుకొని వస్తున్న క్రమంలో బలగాలను లక్ష్యంగా చేసుకుని తెర్రం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో జవాన్లు సత్తార్‌ సింగ్‌ బమ్హాని, భరత్‌ లాల్‌ సాహు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు’’ అని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ‘‘బుధవారం రాత్రి సోదాలు ముగించుకొని వస్తున్న క్రమంలో బలగాలను లక్ష్యంగా చేసుకుని తెర్రం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో జవాన్లు సత్తార్‌ సింగ్‌ బమ్హాని, భరత్‌ లాల్‌ సాహు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు’’ అని పోలీసులు చెప్పారు.

Updated Date - Jul 19 , 2024 | 05:38 AM