Share News

Farmers protest: రైతు మృతి.. ఢిల్లీ ఛలో యాత్ర రెండ్రోజులు రద్దు

ABN , Publish Date - Feb 21 , 2024 | 09:01 PM

రైతుల ఆందోళనలో విషాదం చోటుచేసుకుంది. హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య బుధవారం సాయంత్ర ఘర్షణ చోటుచేసుకోగా, ఒక రైతు మృతి చెందాడు. తాజా ఘటనతో రెండ్రోజుల పాటు 'ఢిల్లీ మార్చ్‌'ను రద్దు చేస్తున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది.

Farmers protest: రైతు మృతి.. ఢిల్లీ ఛలో యాత్ర రెండ్రోజులు రద్దు

ఖనౌరి: రైతుల ఆందోళనలో విషాదం చోటుచేసుకుంది. హర్యానా (Haryana)లోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య బుధవారం సాయంత్ర ఘర్షణ చోటుచేసుకోగా, ఒక రైతు మృతి చెందాడు. పోలీసు చర్యలోనే రైతు మృతి చెందినట్టు రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) ఆరోపించింది. తాజా ఘటనతో రెండ్రోజుల పాటు 'ఢిల్లీ మార్చ్‌'ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే బైఠాయింపు నిరసన ప్రదర్శన కొనసాగుతుందని తెలిపింది.


రైతులు, పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో మృతి చెందిన రైతు ఒంటిపై బుల్లెట్ గాయాలున్నట్టు పాటియాలా ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదక కోసం ఎదురుచూస్తు్న్నామన్నారు. కనౌరి నుంచి ముగ్గురు పేషెట్లు తమవద్దకి వచ్చారని, వారిలో ఒకరు ఆసుపత్రికి తీసుకువస్తుండగానే కన్నుమూశారని, తక్కిన ఇద్దరికి తలపై, తొడపై బుల్లెట్ గాయాలున్నాయని పాటియాలా రాజేంద్ర ఆసుపత్రి సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ రేఖి తెలిపారు. ఆసుపత్రికి తీసుకువస్తుండగా మరణించిన వ్యక్తి తలకు బుల్లెట్ గాయమైందని, బుల్లెట్ సైజు ఎంత అనేది పోస్ట్‌మార్టంలో తేలుతుందన్నారు. కాగా, పోలీసు చర్యలో తీవ్రంగా గాయపడి మరణించిన రైతు పైరు సుభ్ కరణ్ సింగ్ అని, పాటియాలా ఆసుపత్రిలో చనిపోయాడని ఏఐకేఎస్ ఒక ప్రకనటలో తెలిపింది. 23 ఏళ్ల సుభ్ కరణ్ సింగ్ బటిండా నివాసి అని, అతను బటిండా జిల్లా వలో గ్రామానికి చెందిన చరణ్ జిత్ సింగ్ కుమారుడని రైతు నేత కాకా సింగ్ కోట్రా తెలిపారు. కరణ్ సింగ్ మృతదేహాన్ని పాటియాలా రాజేంద్ర ఆసుపత్రిలో భద్రపరిచినట్టు చెప్పారు.

Updated Date - Feb 21 , 2024 | 09:01 PM