Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:53 PM
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.
న్యూఢిల్లీ: దళితుల ఆరాధ్యదైవం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (BR Ambedkar) వారసత్వాన్ని, పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చారంటూ అమిత్‌షాపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రివిలిజ్ నోటీసు (Privilege notice) ఇచ్చింది. 187వ నిబంధన కింద టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ రాజ్యసభలో ఈ నోటీసు ఇచ్చారు.
Modi-Rahul Gandhi: మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. ఇన్నిసార్లు భగవంతుడి పేరు వల్లెవేస్తే వాళ్లకు స్వర్గంలో చోటు దొరుకుందని వ్యాఖ్యానించారు. ''అంబేడ్కర్ పేరు వందసార్లు వల్లెవేయండి.. కానీ ఆయన విషయంలో మీ సెంటిమెంట్లు ఏమిటో నేను చెప్పదలచుకున్నాను. జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలోని ప్రభుత్వంతో విభేదించడం వల్లే తొలి మంత్రివర్గం నుంచి అంబేడ్కర్ రాజీనామా చేశారు" అని అన్నారు.
కాగా, పార్లమెంటు శుక్రవారం సమావేశమైనప్పుడు అమిత్‌షా వ్యాఖ్యలు దళిత నేత అంబేడ్కర్‌ను అవమానపరచేలా ఉన్నాయంటూ కాంగ్రెస్, విపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అంబేడ్కర్ ఫోటోలతో పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాపాల చిట్టా..
అమిత్‌షా వ్యాఖ్యలు దుమారం రేగుతున్న నేపథ్యంలో అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును, పాపాల చిట్టాను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''ఆయనను (అంబేద్కర్) రెండు సార్లు ఎన్నికల్లో ఓడించేందుకు పండిట్ నెహ్రూ ప్రచారం సాగించారు. భారతరత్న నిరాకరించారు. పార్లమెంటులో ఫోటో పెట్టేందుకు కూడా ఇష్టపడలేదు'' అని మోదీ విమర్శించారు. అంబేడ్కర్‌పై కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ సాగించిన అరాచకాలు, అంబేడ్కర్‌ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో దాచలేరని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలంతా చూశారని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం గత దశాబ్దకాలంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు
Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
For National News And Telugu News