Share News

MCD Election: ఎంసీడీ వివాదం.. ఆప్ కౌన్సలర్లు లేకుండానే ఆరో సీటుకు ఎన్నిక షురూ

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:10 PM

శుక్రవారం ఎన్నికల పోలింగ్‌కు గంట ముందు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎంసీడీ కమిషనర్ అశ్విని కుమార్‌కు లేఖ రాశారు. ముందస్తు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 5వ తేదీకి ఎన్నికలు వాయిదా వేయాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల తేదీని రివైస్ చేసి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించడం వల్ల లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

MCD Election: ఎంసీడీ వివాదం.. ఆప్ కౌన్సలర్లు లేకుండానే ఆరో సీటుకు ఎన్నిక షురూ

న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆరో సీటు ఎన్నికల షెడ్యూల్‌పై తలెత్తిన వివాదం ఓవైపు కొనసాగుతుండగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు లేకుండానే చేపట్టిన ఈ ఎన్నికల ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ సైతం దూరంగా ఉంది. ఎల్జీ అదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు.


కాగా, శుక్రవారం ఎన్నికల పోలింగ్‌కు గంట ముందు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎంసీడీ కమిషనర్ అశ్విని కుమార్‌కు లేఖ రాశారు. ముందస్తు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 5వ తేదీకి ఎన్నికలు వాయిదా వేయాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల తేదీని రివైస్ చేసి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించడం వల్ల లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ!


''సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 11 గంటలకు మీరు ఆదేశాలు జారీ చేసారు. ఇందువల్ల కౌన్సిలర్లు హాజరుకావడానికి సమయం సరిపోదు. నిజానికి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకూ చాలా మంది కౌన్సలర్లకు సమాచారం అందలేదు. ఇంత తక్కువ వ్యవధిలో హాజరుకమ్మనడం వల్ల వారు హాజరు కాలేని పరిస్థితి ఉంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వారికున్న ఎన్నికల హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇందువల్ల కమిషనర్ ఆదేశాలు ఏమాత్రం చెల్లనేరవు'' అని ఒబెరాయ్ పేర్కొన్నారు. శుక్రవారంనాటి ఎన్నికల షెడ్యూల్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కమిషనర్‌ను ఆమె కోరారు.


కాగా, దీనికి ముందు గురువారంనాడు జరిగిన ఎంసీడీ సమావేశంలో గలభా నేపథ్యంలో ఎంసీడీ స్టాడింగ్ కమిటీ ఎన్నికను అక్టోబర్ 5వ తేదీకి షెల్లీ ఒబెరాయ్ వాయిదా వేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వాయిదాను తోసిపుచ్చుతూ శుక్రవారం ఒంటిగంటకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంసీడీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఆరో సీటుకు ఎన్నికకు ప్రిసైడ్ చేయాలని అడిషనల్ మునిసల్ కమిషనర్ జితేంద్ర యాదవ్‌ను ఆదేశించారు. బీజేపీ నేత కమల్‌జిత్ షెరావత్ ఇటీవల వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఎన్నిక కావడంతో ఆ సీటుకు ఎన్నిక అనివార్యమైంది.


Read More National News and Latest Telugu News

రెడ్‌ బుక్‌ అమలు మొదలైంది!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 03:10 PM