Share News

Gautam Adani: అదానీకి యూఎస్ సమన్లపై విదేశాంగ శాఖ క్లారిటీ

ABN , Publish Date - Nov 29 , 2024 | 07:59 PM

ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు.

Gautam Adani: అదానీకి యూఎస్ సమన్లపై విదేశాంగ శాఖ క్లారిటీ

న్యూఢిల్లీ: లంచం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani), ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమాన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి ఎలాంటి సమన్లు కానీ, అరెస్టు కోరుతూ ఎలాంటి లాంఛనప్రాయమైన అభ్యర్థులు రాలేదని స్పష్టం చేసింది. ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు.

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన


''ఈ అంశంపై భారత ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. ఈ అంశం అమెరికా ప్రభుత్వంతో చర్చకు కూడా రాలేదు. సమన్లు, అరెస్టు వారెంట్లు అనేవి పరసర్ప న్యాయ సహాయంలో భాగంగా ఉంటాయి. అలాంటి విజ్ఞప్తులకు మెరిట్ ప్రాతిపదికగా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి యూఎస్ వైపు నుంచి ఎలాంటి అభ్యర్థన మాకు రాలేదు'' అని జైశ్వాల్ తెలిపారు.


లంచం ఆరోపణలను తోసిపుచ్చిన అదానీ గ్రూప్

అదానీ, దాని అనుబంధ సంస్థలు సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఆఫర్ చేశారనే ఆరోపణలో అమెరికాలో కేసు నమోదైందన్న వార్తలు ఇటీవల సంచలనం సృష్టించారు. అయితే ఈ వార్తలు అవాస్తమని అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ తోసిపుచ్చింది. ఎఫ్‌సీపీఏ కింద గౌతమ్ అదానీ, ఆయన బంధువురు సాగర్, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీజ్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్టు వచ్చిన కథనాలను తాము తిరస్కరిస్తున్నామనీ, వీరంతా సెక్యూరిటీస్ సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే కానీ వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదని వివరణ ఇచ్చిందని, ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావనకు రాలేదని అదానీ గ్రీన్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

Karnataka: ముస్లింల ఓటు హక్కుపై వివాదం.. విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం స్వామీజీపై కేసు

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

Updated Date - Nov 29 , 2024 | 07:59 PM