Megastar Chiranjeevi: నేడు పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్న మెగాస్టార్ చిరంజీవి
ABN , Publish Date - May 09 , 2024 | 11:35 AM
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) అందుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) అందుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీ చేరుకున్నారు. గత రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.
అయితే అక్కినేని నాగేశ్వర్‌రావు తర్వాత టాలీవుడ్‌లో ఈ అవార్డు అందుకోనున్న రెండవ నటుడు చిరంజీవి కావడం విశేషం. ఈ స్పెషల్ ఈవెంట్ మెగా అభిమానులందరికీ ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులతోపాటు పలువురు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు చిరంజీవికి గతంలో 2006లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఇక మెగాస్టార్ వృత్తి పరంగా ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇది జనవరి 10, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇది కూడా చదవండి:
Lok Sabha Polls: స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?
Air India Express: సిక్ లీవ్ వివాదం.. 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా
Read Latest News and National News click here