Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:15 PM
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వేసవి ( Summer ) వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ వర్షాలు సైతం అదే రీతిలో కురుస్తాయని తీపి కబురు అందించింది.
ఈసారి దేశవ్యాప్తంగా రుతుపవనాలు రావాల్సిన సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. హిందూ మహాసముద్రం డైపోల్, లానినా పరిస్థితులు ఒకే సమయంలో చురుకుగా మారడంతో రుతుపవనాలు త్వరగానే రానున్నాయి. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై సానుకూల దశను సూచిస్తున్న రుతు పవనాలు పసిఫిక్‌లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి.
Former CM: ‘కుమార’ విందుకు ఎన్నికల అధికారుల చెక్.. తోటలో ఏర్పాటు చేసిన కుర్చీలు, షామియానాల తొలగింపు
జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని అధికారులు తెలిపారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయి. జూలై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అంచనా వేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.