Share News

Suvendu Adhikari: సువేందు అధికారికి ఇక దేశమంతటా 'జడ్' కేటగిరి భద్రత

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:06 PM

బీజేపీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారికి గతంలో 'జడ్' కేటగిరి భద్రత ఉన్నప్పటికీ అది పశ్చిమబెంగాల్‌ వరకే పరిమితం చేశారు. రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లినా 'వై ప్లస్' కంటే తక్కువ భద్రత ఉండేది. దేశంలోని వీఐపీలకు గరిష్టంగా జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంటారు.

Suvendu Adhikari: సువేందు అధికారికి ఇక దేశమంతటా 'జడ్' కేటగిరి భద్రత

న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్య నేత, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) భద్రత విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పశ్చిమబెంగాల్‌ వరకే ఆయనకు 'జడ్' కేటగిరి భద్రత కల్పిస్తుండగా, ఇప్పుడు దేశమంతటికీ ఆ భద్రతను విస్తరించింది. దీంతో ఆయన దేశంలో ఎక్కడికి వెళ్లినా 'జడ్‌' కేటగిరి భద్రతను కల్పిస్తారు. సువేందు అధికారి ప్రాణాలకు ముప్పు పెరిగిందని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తాజా నివేదిక ఆధారంగా ఎంహెచ్ఏ ఈ నిర్ణయం తీసుకుంది.

PM Modi: కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు


బీజేపీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారికి గతంలో 'జడ్' కేటగిరి భద్రత ఉన్నప్పటికీ అది పశ్చిమబెంగాల్‌ వరకే పరిమితం చేశారు. రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లినా 'వై ప్లస్' కంటే తక్కువ భద్రత ఉండేది. దేశంలోని వీఐపీలకు గరిష్టంగా జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంటారు. తాజాగా సువేందుకు కల్పించిన భద్రత ప్రకారం ఆయన వెంట ఆరు నుంచి ఏడుగురు సాయుధ సీఆప్‌పీఎఫ్ కమెండోలు, ఒక పైలట్ వాహనం, ఎస్కార్ట్ వాహనం ఉంటాయి. ఆయన ప్రయాణాలు, నివాస ప్రాంతాలు, కార్యాలయం, ఇతర కీలక లొకేషన్లను ఈ విస్తృతమైన భద్రత ఉంటుంది. సువేందు అధికారి 2020లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా విస్తృత ప్రచారంలోకి వచ్చారు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కనిపిస్తుండటం, విపక్ష నాయకులకు ముప్పు ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన భద్రతను విస్తరించినట్టు చెబుతున్నారు.


కృతజ్ఞతలు చెప్పిన సువేందు

తనకున్న భద్రతను దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఎంహెచ్ఏ నిర్ణయం తీసుకోవడంపై సువేందు అధికారి హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ విధులను సక్రమంగా నిర్వహించడానికి, ఏలాంటి భద్రతా భయం లేకుండా ప్రజా సేవ కొనసాగించేందుకు ఈ చర్య దోపడపడుతుందన్నారు. ఈ దిశగా తనకు మద్దతుగా నిలిచిన తన అనుచరులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

Bangalore: ఓ మై డాగ్‌.. క్లూస్‌ టీం డాగ్‌ సిరి మృతితో పోలీసుల ఆవేదన

For National news And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 04:06 PM