Share News

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:40 PM

మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!

వాషింగ్టన్, జులై 19: మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి. అలాగే అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు అందించే 911పై ప్రభావం పడింది.


వార్తా ప్రసారాలు జరుగుతుండగా మధ్యలో స్కై న్యూస్ నిలిచిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక భారత్‌లో విమాన, ఐటీ సేవలకు సైతం అంతరాయం కలిగింది. ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం ఏర్పడింది. దాంతో ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం కీలక సూచనలు చేసింది.

Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’


మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఆస్ట్రేలియాలోని వివిధ రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా చూపించింది. దాంతో వార్తలు సైతం ఆస్ట్రేలియా న్యూస్ ఛానెళ్లు ప్రసారం చేయలేని పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమాన సేవలపై దాని ప్రభావం పడింది. మరోవైపు అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు చేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితిపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతుంది. ఇక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌తోపాటు ఆన్‌లైన్ సేవలపై దాని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 02:40 PM