LokSabha Elections 2024: అగ్రనేతల ప్రచారం.. అభ్యర్థులు ముందంజ
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:56 PM
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు దేశవ్యాప్తంగా పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 04: సార్వత్రిక ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు దేశవ్యాప్తంగా పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే అవి ఏ మేర ఓటర్లను ప్రభావితం చేశాయనేది ఓట్ల లెక్కింపు వేళ సుస్పష్టమైంది. ప్రధాని మోదీ మొత్తం180 బహిరంగ సభల్లో పాల్గొంటే.. వాటిలో 100 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
అలాగే అమిత్ షా మొత్తం137 ర్యాలీల్లో పాల్గొంటే.. వాటిలో 78 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ మొత్తం 43 ర్యాలీల్లో పాల్గొనగా.. 21 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ మొత్తం 62 ర్యాలీల్లో పాల్గొంటే.. 26 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక్యతలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ.. ఎన్నికల బరిలో నిలవనున్నారనే ఓ ప్రచారం అయితే గట్టిగానే జరిగింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని.. ఆ క్రమంలో తాను ఎన్నికల బరిలో నిలవడం లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేసిన విషయం విధితమే.
Read Latest International News and Telugu News