Share News

Rail-Road Bridge: వారణాసిలో రూ.2,642 కోట్లతో రైల్-రోడ్ బ్రిడ్జి.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 16 , 2024 | 05:13 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Rail-Road Bridge: వారణాసిలో రూ.2,642 కోట్లతో రైల్-రోడ్ బ్రిడ్జి.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి (Varanasi)లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి (Rail-cum-road bridge) నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనసామర్థ్యాన్ని (traffic capacity) పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలోని అతి పెద్ద వంతెనల్లో ఇదొకటి అవుతుందని క్యాబినెట్ సమావేశానంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాకు తెలిపారు.

Good News: రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ పంటలకు కనీస మద్దతు ధర పెంపు


రూ.2,642 కోట్లతో..

కొత్త రైల్-రోడ్ బ్రిడ్జిని రూ.2,642 కోట్లతో నిర్మించనున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ''మాల్వీయ బ్రిడ్జి కట్టి 137 ఏళ్లయింది. ఇప్పుడు కొత్త బ్రిడ్జి నిర్మాణం జరపనున్నాం. లోయర్ డెక్‌లో 4 రైల్వే లైన్లు, అప్పర్ డెక్‌‌పై 6 లేన్ల హైవే ఉంటుంది. ట్రాఫిక్ కెపాసిటీ దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జిలలో ఇదొకటి అవుతుంది'' అని మంత్రి తెలిపారు.


కాగా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి-చౌందాలి జిల్లాల గుండా కొత్త వంతెన నిర్మాణం జరుగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ రైల్వేస్‌కు క్రూషియల్ హబ్‌గా వారణాసి రైల్వే స్టేషన్ ఉందని, యాత్రికులు, పర్యాటకులు, స్థానిక జనాభాకు గేట్‌వేగా నిలుస్తోందని పేర్కొంది. పెరుగుతున్న టూరిజం, ఇండస్ట్రియల్ డిమాండ్‌కు అనుగుణంగానే కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణం జరగనుందని తెలిపింది. ఇందువల్ల ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ప్రధాన మంత్రి మోదీ 'న్యూ ఇండియా' విజన్, 'ఆత్మ నిర్భర్ భారత్' విజన్‌ దిశగా ఇదొక ముందడుగు అని అభివర్ణించింది.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి..

Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..

DA Hike: మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

Updated Date - Oct 16 , 2024 | 05:13 PM