Budget 2024: చౌకగా మొబైల్స్..!! దిగుమతి సుంకం తగ్గించిన మోదీ సర్కార్
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:53 PM
ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ స్పేర్ పార్ట్‌లపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
ఢిల్లీ: ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ స్పేర్ పార్ట్‌లపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడి భాగాలపై దిగుమతి సుంకం 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది. ప్లాస్టిక్, మెటల్ వస్తువులపై కూడా సుంకం తగ్గించారు.
మొబైల్ బ్యాక్ కవర్, బ్యాటరీ కవర్, జీఎస్ఎం యాంటెన్నా, మెయిన్ కెమెరా లెన్స్, ప్లాస్టిక్, ఇతర వస్తువులపై దిగుమతి సుంకం తగ్గించారు. ఇలా దిగుమతి సుంకం తగ్గిస్తే వచ్చే రెండేళ్లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం 11 బిలియన్ల మొబైల్స్ ఎగుమతి అవుతున్నాయి. అవి 39 బిలియన్లకు చేరతాయని ఇండిన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చెబుతోంది. 2024లో భారతీయ మొబైల్ పరిశ్రమ 50 బిలియన్ల విలువ గల మొబైల్స్ తయారు చేయనుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది 55 నుంచి 60 బిలియన్లకు చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది 15 బిలియన్ల ఎగుమతి చేయనుండగా, 2025లో 27 బిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఎస్టిమేట్ వేసింది.
మరిన్ని బడ్జెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.