Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే మోదీ లక్ష్యం
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:32 PM
ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.
వయనాడు: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై వయనాడ్ (Wayanad) లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) విమర్శలు గుప్పించారు. ప్రజాక్షేమం కోసం కాకుండా వాణిజ్యవేత్తల ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక అన్నారు.
Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్
''మోదీ వాణిజ్య మిత్రుల కోసమే ఆయన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే ఆలోచన లేదు. కొత్త ఉద్యోగాల ఇవ్వదు, మెరుగైన విద్యా, ఆరోగ్య సౌకర్యలు, ప్రోగ్రామ్‌ల పట్టింపు అసలే లేదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. మిమ్మల్ని విడగొడుతుంది, విద్వేష వ్యాప్తి చేస్తుంది. ప్రజాస్వామిక వ్యవస్థలను అణగదొక్కి మీ హక్కులను ఊడలాక్కుంటుంది'' అని ప్రజలను ప్రియాంక అప్రమత్తం చేశారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచిన వయనాడ్ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీని విమర్శించడమే పనిగా బీజేపీ పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. ఆయన ప్రతిష్టను దిగజార్జేందుకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, అయితే సత్యం కోసం పోరాడుతున్న రాహుల్‌కు ఇక్కడి ప్రజలు అండగా నిలిచారని, ఆయన పోరాటానికి దన్నుగా ఉన్నారని ప్రశంసించారు. గత ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఆ సీటుకు రాజనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రియాంకపై నవ్య హరిదాస్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది. నవంబర్ 13న వయనాడ్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన
Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం
Read More National News and Latest Telugu News