Share News

Lok Sabha Elections: అవును...పారిశ్రామిక వేత్తలను కాపాడేందుకే భగవంతుడు మోదీని పంపాడు..!

ABN , Publish Date - May 28 , 2024 | 05:42 PM

''ఆ పరమాత్ముడే నన్ను ఇక్కడకు పంపాడు'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలకు సాయం చేసేందుకే ఆయనను పరమాత్మ పంపారని వ్యాఖ్యానించారు.

Lok Sabha Elections: అవును...పారిశ్రామిక వేత్తలను కాపాడేందుకే భగవంతుడు మోదీని పంపాడు..!

న్యూఢిల్లీ: ''ఆ పరమాత్ముడే నన్ను ఇక్కడకు పంపాడు'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిప్పికొట్టారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలకు సాయం చేసేందుకే ఆయనను పరమాత్మ (God) పంపారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, రైతులు, కార్మికులకు సేవలందించేందుకు మోదీని భగవంతుడు పంపలేదన్నారు.

PM Modi: నవీన్‌ బాబుతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదో వెల్లడించిన మోదీ


''అందరూ జీవిసంబంధితులే. మోదీ మాత్రం అలా కాదు. ఆయనను అంబానీ, అదానీలకు సాయం చేయడం కోసం పరమాత్మ ప్రత్యేకంగా పంపించాడు. రైతులు, కార్మికులను ఆదుకునేందుకు కాదు. ఆయనను పరమాత్మే పంపించి ఉంటే పేదలు, అన్నదాతలను ఆదుకుని ఉండేవారు. అలా కాదంటే ఆయన ఏ తరహా పరమాత్ముడని అనుకోవాలి? మోదీకి చెందిన పరమాత్ముడుగానే అనుకోవాలి'' అని రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 'అగ్నిపథ్' పథకాన్ని చెత్తకుప్పలో పడేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితికి చరమగీతం పాడతామని హామీ ఇచ్చారు.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 05:54 PM