Lok Sabha Elections 2024: దేశంలో మార్పు కనిపిస్తోంది, కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ: సచిన్ పైలట్
ABN , Publish Date - Apr 29 , 2024 | 07:02 PM
దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సచిన్ పైలట్ అన్నారు. ఈసారి ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
బిలాస్‌పూర్: దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. ఈసారి ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) లో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
''దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. మేము వారికి (బీజేపీ) రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని ప్రజలు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్పు కనిపిస్తోంది. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండబోతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ (ఛత్తీస్‌గఢ్) బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని కచ్చితంగా చెప్పగలను'' అని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో ఎప్పుడూ మెజారిటీ సీట్లు తెచ్చుకోలేదని, అయితే ఈసారి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, మేనిఫెస్టో, వ్యూహాలు కాంగ్రెస్‌కు పాజిటివ్ ఫలితాలను ఇవ్వనున్నాయని, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఫలితాలపై ఎంతో ఉత్సుకతతో ఉన్నారని తెలిపారు.
Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్
ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో రికార్డు స్థాయిలో 76.24 శాతం పోలింగ్ నమోదైంది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9 సీట్లు బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.
Read Latest news and National News here..