Share News

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:27 PM

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు కేసు నమోదు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేయడం, విచారణలో ఆస్తులను జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 27న రాష్ట్ర లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్య, మరి కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజ్ అనే వ్యక్తి పేర్లు ఉన్నాయి. దేవరాజ్ నుంచి మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి పార్వతికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఆరోపణ. ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై దర్యాప్తు చేయాలంటూ బెంగళూరు స్పెషల్ కోర్టు సెప్టెంబర్ 25న ఉత్తర్వులు ఇచ్చింది.

Supreme Court: పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట


ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అతడితోపాటుగా స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్‌ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. ఆగస్టు 16న ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలను ప్రత్యేక కోర్టు సమర్ధించింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇది కూడా చదవండి..

BJP : జమిలిపై ముందుకే!

Updated Date - Sep 30 , 2024 | 07:27 PM