Water Cut: ముంబైలో కూడా నీటి కష్టాలు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Mar 19 , 2024 | 12:17 PM
ఐటీ హబ్ బెంగళూరులో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఆ నీటి పాట్లు ఇప్పుడు ముంబైకి షిప్ట్ అయ్యాయి. ముంబైలో మంగళవారం (ఈ రోజు) నీటిలో 15 శాతం కోత ఉంటుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. థానే జిల్లాలో గల పైస్ డ్యామ్‌లో తగినంత నీటిమట్టం లేదని, అందుకోసమే అదనంగా నీటి కోత విధించాల్సి వస్తోందని బీఎంసీ అధికారులు తెలిపారు.
ముంబై: ఐటీ హబ్ బెంగళూరులో (Bengalure) నీటి కష్టాలు (Water) అంతా ఇంతా కాదు. నీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ నీటి కష్టాలు బెంగళూర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి (Mumbai) షిప్ట్ అయ్యాయి. ముంబైలో మంగళవారం (ఈ రోజు) నీటిలో 15 శాతం కోత ఉంటుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. థానే జిల్లాలో గల పైస్ (Pise) డ్యామ్‌లో తగినంత నీటిమట్టం లేదని, అందుకోసమే అదనంగా నీటి కోత విధించాల్సి వస్తోందని బీఎంసీ అధికారులు తెలిపారు. దీంతోపాటు 5 శాతం కోత అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
15 శాతం నీటి కోత
పైస్ డ్యామ్‌కు 32 గేట్లు ఉన్నాయి. అందులో ఒక గేట్ రబ్బర్ బ్లాడర్ డిసెంబర్ నెలలో పనిచేయలేదు. డ్యామ్ నుంచి నీరు లీక్ అయ్యింది. రబ్బర్ బ్లాడర్ సరి చేయడానికి నీటి మట్టాన్ని 31 మీటర్లకు తగ్గించాల్సి వచ్చింది. ఆ నీటిని భట్సా రిజర్వాయర్‌కు తరలించారు. పైస్ డ్యామ్‌లో గల రబ్బర్ బ్లాడర్ సరి చేశారు. పంజర్ పోల్ వద్దగల ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా ముంబైకి నీరు పంపింగ్ చేయడం సాధ్య పడలేదు. డ్యామ్‌లో తగినంత నీటి నిల్వ చేసే సామర్థ్యం లేదు. దీంతో గతంలో తరలించిన నీరు భట్సా రిజర్వాయర్‌లోనే ఉండిపోయింది.
5 శాతం కోత
ఆసియాలో పెద్దదైన భాండప్ వాటర్ ప్లాంట్‌ను శుభ్రం చేయాల్సి ఉంది. అందుకోసం 5 శాతం నీటి కోతను విధిస్తామని బీఎంసీ ఇదివరకే ప్రకటన చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఈ కోత ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Lok Sabha Elections: ఎన్డీఏకు ఆర్ఎల్జీపీ గుడ్ బై.. కేంద్రమంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా..?
CAA: సీఏఏ అమలుపై 200 పిటిషన్లు.. విచారించనున్న సుప్రీంకోర్టు