Share News

2024 Elections: కేరళ, తమిళనాడులో ఎన్నికల తేదీ మార్చాలని డిమాండ్.. కారణం ఏంటంటే?

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:26 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల (2024 Lok Sabha Elections) తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) (Election Commission Of India) శనివారం (16/03/24) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయని.. తొలి దశ ఎన్నికల ఏప్రిల్ 19వ తేదీ నిర్వహించనుండగా, ఏడో దశ ఎన్నికలు జూన్ 1వ తారీఖున ఉంటాయని ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (ECI Chief Commissioner Rajiv Kumar) వెల్లడించారు.

2024 Elections: కేరళ, తమిళనాడులో ఎన్నికల తేదీ మార్చాలని డిమాండ్.. కారణం ఏంటంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల (2024 Lok Sabha Elections) తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) (Election Commission Of India) శనివారం (16/03/24) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయని.. తొలి దశ ఎన్నికల ఏప్రిల్ 19వ తేదీ నిర్వహించనుండగా, ఏడో దశ ఎన్నికలు జూన్ 1వ తారీఖున ఉంటాయని ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (ECI Chief Commissioner Rajiv Kumar) వెల్లడించారు. అయితే.. కేరళ (Kerala) , తమిళనాడులో (Tamil Nadu) ఎన్నికల తేదీలను మార్చాలని తాజాగా డిమాండ్లు వస్తున్నాయి.


ఏప్రిల్ 19న తమిళనాడులోనూ, ఏప్రిల్ 25న కేరళలోనూ ఎన్నికలు జరగనుండగా.. ఆ రెండు తేదీలను మార్చాల్సిందిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)తో పాటు ఇతర ముస్లిం సంఘాలు కోరుతున్నాయి. ఎందుకంటే.. ఆ రెండు తేదీలూ శుక్రవారం రోజు వస్తాయి. శుక్రవారం ముస్లింలకు ఎంతో ముఖ్యమైంది. ఆరోజున అందరూ నమాస్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకే ఎన్నికల తేదీని మార్చాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తామని చెప్తున్నారు. శుక్రవారం ఎన్నికలను నిర్వహిస్తే.. ఓటర్లతో పాటు అధికారులు, అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారని IUML పేర్కొంటోంది.

ఈ విషయంపై IUML రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ (PMA Salam) మాట్లాడుతూ.. శుక్రవారం నాడు ప్రజలు నమాస్ చేసేందుకు మసీదుల్లో గుమిగూడుతారని.. అలాంటి రోజున ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లతో పాటు అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధుల్లో నియమించబడిన అధికారులు అసౌకర్యానికి గురవుతారని చెప్పారు. కాబట్టి.. ఎన్నికల తేదీలనను మార్చాలని కోరుతూ తమ ముస్లిం లీగ్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. తమ ముస్లిం లీగ్‌తో పాటు ఇతర ముస్లిం సంస్థలు సైతం.. ఎన్నికల తేదీలని మార్చాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించనున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 04:26 PM