Share News

Mysore Darbhanga Train Accident: మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. రంగంలోకి ఎన్‌ఐఏ, హెల్ప్‌లైన్ నంబర్‌లు జారీ

ABN , Publish Date - Oct 12 , 2024 | 10:45 AM

తమిళనాడు మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణను రైల్వేశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించారు.

 Mysore Darbhanga Train Accident: మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. రంగంలోకి ఎన్‌ఐఏ, హెల్ప్‌లైన్ నంబర్‌లు జారీ
Mysore Darbhanga train accident

తమిళనాడులోని కవరైపేట్టై రైల్వే స్టేషన్‌లో మైసూర్-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును(Mysore Darbhanga train accident) శుక్రవారం రాత్రి ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కోచ్‌లకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆ క్రమంలో దాదాపు 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. బాలాసోర్‌లో జరిగినట్లుగానే రైలు ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ గూడ్స్ రైలు కూడా నిలబడి ఉంది. ఆ క్రమంలో ప్యాసింజర్ రైలు వెళ్లి గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. షాక్ తగిలేసరికి బ్రేకులు వేశాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కొందరిని ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.


విచారణ

ఈ ప్రమాదంపై అప్రమత్తమైన రైల్వే శాఖ విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. రైల్వే ఉద్యోగి తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా దర్యా్ప్తు చేయనున్నారు. రైల్వే సీఎస్‌ఆర్‌తో పాటు ఈ ఘటనపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. పండుగల సీజన్ కావడంతో రైలులో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.


హెల్ప్‌లైన్ నంబర్లు

ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రయాణికులు, వారి కుటుంబాల కోసం దక్షిణ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేశారు. ఎవరైనా ప్రయాణికుల విషయంలో అనుమానాలు ఉంటే ఈ నంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

  • చెన్నై డివిజన్ హెల్ప్‌లైన్ నంబర్లు : 04425354151, 04424354995

  • సమస్తిపూర్ - 8102918840, దర్భంగా - 8210335395

  • దానాపూర్ - 9031069105

  • దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ - 7525039558


ప్రమాదం తర్వాత

మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ తమిళనాడులోని కవరైపేట్టై రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు, దాని రెండు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. 12-13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 19 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ క్షతగాత్రులను పరామర్శించారు.

పలు రైళ్లు

మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా చాలా రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులందరినీ ఈఎంయూ ద్వారా చెన్నై సెంట్రల్‌కు తీసుకెళ్తున్నట్లు నైరుతి రైల్వే తెలిపింది. దర్భంగా, ఇతర గమ్యస్థానాలకు ఉచిత ఆహారం, నీరు, స్నాక్స్‌తో పాటు వారిని చేర్చడానికి చెన్నైలో కొత్త రైలు సిద్ధం చేశారు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 12 , 2024 | 10:50 AM