Share News

Rahul Gandhi: నిస్సహాయ స్థితిలో మోదీ సర్కార్.. రాహుల్ నిప్పులు

ABN , Publish Date - Jun 23 , 2024 | 09:07 AM

కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడంపై మండిపడింది. పేపర్ లీక్ అవుతోన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తింది. విద్యార్థుల భవిష్యత్‌కు బీజేపీ ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయని విరుచుకుపడింది.

Rahul Gandhi: నిస్సహాయ స్థితిలో మోదీ సర్కార్.. రాహుల్ నిప్పులు
Rahul Gandhi

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడంపై మండిపడింది. పేపర్ లీక్ అవుతోన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తింది. విద్యార్థుల భవిష్యత్‌కు బీజేపీ ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయని విరుచుకుపడింది.


‘ ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. మోదీ నేతృత్వంలో విద్యా వ్యవస్థ దిగజారిపోయింది. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉంది. పేపరల్ లీక్ వ్యవహారంలో ఆ విషయం స్పష్టమైంది. విద్యావ్యవస్థ మాఫియా, పేపర్ లీక్ అంశంలో మోదీ సర్కార్ నిస్సహాయంగా ఉంది. భావి భారత పౌరులు విద్యార్థులు. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చారు అని’ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ వ్యవహారంతో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది.

Updated Date - Jun 23 , 2024 | 09:57 AM