PM Modi: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:05 PM
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలిసమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేశారు.
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలిసమావేశాలు (First Meetings) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ (Protem Speaker) భర్తృహరి మహతాబ్ (Bhartrihari Mahatab) ఎంపీలతో ప్రమాణ స్వీకారం (Oath taking) చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారంచేశారు. మోదీ ప్రమాణం చేస్తుండగా సభ హర్షద్వానాలతో దద్దరిల్లింది. ఆ తరువాత రాధా మోహన్ సింగ్(Radha Mohan Singh), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), అమిత్ షా (Amit Shah), నితిన్ గడ్కరీ (Nitin Gadkari), శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.. మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఏపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు 279 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన 264 మంది ఎంపీలు రెండో రోజు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఎంపీలు రెండోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.