Home » Oath cermony
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలిసమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండ్రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో తొలిరోజు శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లో జూన్ 13న ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM chadrababu) బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా ఆయన తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సచివాలయానికి రానున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు ...
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్(Singapore Consulate), కొరియా కాన్సులేట్ (Koria Consulate) జనరల్స్, ఇతర ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం జగన్‌ను (Jagan) ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్వయంగా ప్రయత్నించారు. జగన్‌తో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.