Share News

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్

ABN , Publish Date - Nov 15 , 2024 | 08:25 AM

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయుకాలుష్యానికి పంజాబ్, హర్యానాలలో పొట్టు దగ్ధం వంటి ఘటనలు ఓ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీటిని అరికట్టాలని చెప్పినప్పటికీ అనేక మంది రైతులు పాటించడం లేదని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఇటివల నాసా విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్
NASA images viral

ప్రస్తుతం ఢిల్లీ (delhi) పరిధిలో గాలి నాణ్యత చాలా దారుణంగా తయారైంది. ఉత్తర భారతదేశంలో వేసవి ముగింపు తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించడం చాలా సవాలుగా మారింది. అంతేకాదు పంజాబ్, హర్యానాలలో వరి పొట్టు దగ్ధం వంటి సంఘటనలు ఎక్కువగా అవుతుండటం కాలుష్యానికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలలో అమెరికా ఏజెన్సీ నాసా ఇటివల విడుదల చేయగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ కారణంగా పెరుగుతున్న కాలుష్యం

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయుకాలుష్యం పెరగడానికి పంజాబ్, హర్యానాలలో పొట్టు దగ్ధం వంటి సంఘటనలు పెరగడమేనని అంటున్నారు నిపుణులు. గత అనేక నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ ఏడాది కూడా రైతుల పొట్టు దగ్ధం వంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పుంజుకుంది. పంజాబ్, హర్యానాలలో లైవ్ ఫైర్ మ్యాప్ భారీ అగ్నిప్రమాదాల నాసా చిత్రాలు ఈ కాలుష్యం తీవ్రతను స్పష్టంగా చూపిస్తుండటం విశేషం.


పంజాబ్‌లో తరచుగా

ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలో సింధు-గంగా మైదానాల్లో రైతులు మంటలు పెట్టారు. ఆ క్రమంలో వచ్చిన పొగ మేఘాలను నాసా ఉపగ్రహాలు గుర్తించాయి. పంజాబ్, ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ముఖ్యంగా వీటిచేత ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. పంజాబ్‌లోని రైతులు తరచుగా గోధుమ, వరి పంట కోసం పొలాలను సిద్ధం చేయడానికి వాటి అవశేషాలను కాల్చివేస్తారు. ఇది చౌకైన పద్ధతి అయినప్పటికీ, దీని కారణంగా వచ్చే కాలుష్యం ఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది.


ట్రాఫిక్ అంతరాయం

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నివేదిక ప్రకారం న్యూఢిల్లీలో శుక్రవారం వరుసగా మూడవ రోజు గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో, 21 ప్రాంతాల్లో తీవ్రమైన AQI స్థాయిలు నమోదయ్యాయి. నాలుగు 'తీవ్రమైన ప్లస్'గా వర్గీకరించబడ్డాయి. జహంగీర్‌పురి, బవానా, వజీర్‌పూర్, రోహిణిలలో AQI స్థాయిలు వరుసగా 458, 455, 455, 452తో అత్యంత చెత్త కాలుష్యాన్ని ఎదుర్కొన్నాయి. గత 24 గంటల గాలి నాణ్యత గురువారం నాటి సగటు AQI 432తో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడిందని చెప్పవచ్చు. దీంతో ఢిల్లీ నగరం మొత్తం ఉదయం వేళ పొగమంచుతో కప్పబడి ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్, విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి:

Viral News: రీల్ వీడియో రూపొందించండి.. రూ. 1.5 లక్షల బహుమతి గెల్చుకోండి..


Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..


Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 15 , 2024 | 08:27 AM