Jammu Kashmir Elections: నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సీట్ల లెక్క తేలింది.. ఎవరెవరికి ఎన్నంటే..?
ABN , Publish Date - Aug 26 , 2024 | 08:31 PM
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 32 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తమ అభ్యర్థులను నిలబెడుతుంది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Elections) పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ (Congress) మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 32 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తమ అభ్యర్థులను నిలబెడుతుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్‌గా 5 సీట్లలో రెండు పార్టీలు పోటీ చేస్తాయి. హర్ష్ దేవ్ సింగ్ సారథ్యంలోని పాంథర్స్ పార్టీ, సీపీఎం చెరో సీటులో తమ అభ్యర్థులను నిలబెడతాయి.
Jammu and Kashmir elections: మోదీ లీడ్ క్యాంపెయినర్‌గా 40 మందితో బీజేపీ లిస్ట్
నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందాన్ని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, జే-కే కాంగ్రెస్ చీఫ్ హమీద్ హర్రా ఆదివారంనాడు జరిపిన మీడియా సమావేశంలో ప్రకటించారు. సుహృద్భావ వాతావరణంలో సంప్రదింపులు జరిగాయని, సీట్ల సర్దుబాటు పూర్తయిందని, కలిసికట్టుగానే తాము ఈ ఎన్నికల్లో పనిచేస్తామని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్న శక్తులపై కలిసికట్టు పోరాటానికి తాము దిగుతుండటం సంతోషంగా ఉందన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి పోరాడుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి గెలుస్తామని కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. దోడ, నగ్రోటా, బనిహాల్, సోపోర్, బెదెర్వాహ్‌లో రెండు పార్టీల మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..