Share News

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:30 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.

ఈ వ్యవహారంపై ఎన్టీఏ (NTA), కేంద్రం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు.. కేంద్రం, ఎన్టీయే సమర్పించిన అఫిడవిట్‌లను ఇంకా అందుకోలేదని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గమనించింది. వాటిని పరిశీలించేందుకు వీలుగా విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ చెప్పారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కచ్చితమైన ఆధారాలు లేవని కోర్టుకు తెలిపింది. కొన్ని సెంటర్లలో మాత్రమే పరీక్ష పేపర్ లీక్ జరిగినట్లు వెల్లడించింది. లీకైన నీట్ పేపర్ బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని.. దేశమంతటా కాదని సీబీఐ కూడా సుప్రీం కోర్టుకు తెలిపింది.


సోషల్ మీడియాలో కూడా ఇది వ్యాప్తి చెందలేదని చెబుతూ.. ఇందుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసింది. NTA భద్రతను వివరించడానికి ప్రశ్నపత్రం ముద్రణ, రవాణా, పంపిణీకి సంబంధించిన ప్రోటోకాల్‌లను కూడా వివరించింది.

అయితే పేపర్ లీకేజీపై కోర్టు మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు చేసిన తప్పుతో లక్షల మంది జీవితాలు ప్రభావిమయ్యాయని పేర్కొంది. పరీక్షను మళ్లీ జరిపేందుకు లీకేజీ పరిధి ఎక్కడి వరకుందో తెలుసుకోవాలని సూచించింది. సంబంధిత పత్రాలను సమర్పించాలని ఎన్టీయే, కేంద్రం, సీబీఐలను ఆదేశించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 11 , 2024 | 04:30 PM