Nirmala Sitaraman : పరిశోధన రంగంలో బెంగళూరుకు భారీ లబ్ధి
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:01 AM
పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల
బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆమె మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలు చేయనుండటం బెంగళూరుకు అనుకూలం కానుందన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు పెద్దమొత్తంలో నిధి (వెంచర్ కేపిటల్) ఇచ్చామని, ఇస్రో సంబంధిత పనులు ఇక్కడే కొనసాగుతాయని పేర్కొన్నారు. స్టార్ట్‌పలపై ఏంజెల్ టాక్స్ రద్దు చేశామనీ, అది కూడా బెంగళూరు అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.